రైతులకు ఏక కాలంలో రుణమాఫీ

జాతీయ రుణవిమోచన కమిషన్‌ ఏర్పాటు
కనీస పెన్షన్‌ రూ. 9000
యువతకోసం భగత్‌సింగ్‌ జాతీయ ఉపాధిహామీ పథకం
సిపిఐ లోక్‌సభ ఎన్నికల ప్రణాళిక విడుదల

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని, జాతీయ రుణ విమోచన కమిష న్‌ ఏర్పాటు చేస్తామని, 60 ఏళ్లు దాటిన రైతులు, వ్యవసాయకూలీలకు పెన్షన్‌ కల్పిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మ్యానిఫెస్టో పేర్కొంది. యువతకు ఉపాధి కల్పించేందుక భగత్‌సింగ్‌ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తామని, ప్రస్తుతం ఉన్న సం క్షేమ పథకాలను కొనసాగిస్తూనే పేదరిక నిర్మూలనకు కనీస ఆదాయ హామీని కల్పించే భారీ పథకాన్ని తీసుకువస్తామని తెలిపింది. నాబార్డ్‌ తరహాలో స్వయం సహాయక బృందాలు, మహిళా పారిశ్రామిక వేత్తలకు నిధులిచ్చేందుకు జాతీయ మహిళా బ్యాంకు ఏర్పాటు, చట్టసభలు, జాతీయ కమిషన్‌లలో మహిళలకు 33 శాతం, స్థానిక సంస్థల్లో అన్నిస్థాయిల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు మినహా వయో వృద్ధులందరికీ పెన్షన్‌ను వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. ప్రైవేటు రంగం లో కూడా రిజర్వేషన్‌లు అమలు చేస్తామని పేర్కొంది. సామూహిక హత్యలు (లించింగ్‌)కు వ్యతిరేకంగా పట్టిష్ట చట్టం తీసుకువస్తామని తెలిపింది. సిపిఐ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికను సురవరం సుధాకరరెడ్డి హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా పార్టీ ఎన్నికల ప్రణాళికను సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయం అజయ్‌భవన్‌లో విడుదల చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌, కార్యవర్గ సభ్యులు అనీరాజా, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి దినేష్‌ వర్షినే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ‘పని హక్కు’ను ‘ప్రాథమిక హక్కు’గా మార్చాలని, జాతీయ కార్మిక సదస్సు సిఫార్సులకు అనుగుణంగా జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించాలని మ్యానిఫెస్టో విడుదల అనంతరం సురవరం అన్నారు. జాతీయ ప్రజా పంపి ణీ వ్యవస్థ ప్రయోజనాలను సార్వత్రీకరించి, ఆధార్‌, బయోమెట్రిక్‌ లాంటి నిబంధనలతో నిమిత్తం లేకుండా అర్హులైన అందరికీ అమలు చేస్తామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?