రెడ్‌జోన్‌లుగా ఆరు జిల్లాలు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి, నమోదైన కేసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను ప్రకటించింది. గడిచిన 21 రోజులుగా కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్‌జోన్‌గా గుర్తించింది. ఆయా జిల్లాల వారీగా కేసులు, కోలుకుంటున్న వారు, తదితర అంశాల ఆధారంగా జోన్లు ఖరారుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం లో రెడ్‌జోన్‌ పరిధిలో 6, ఆరెంజ్‌ పరిధిలో 18, గ్రీన్‌జోన్‌ పరిధిలో 9 జిల్లాలను నోటిఫై చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెడ్‌జోన్‌గా 5 జిల్లాలు, ఏడు జిల్లాలు ఆరెంజ్‌, ఒక జిల్లా గ్రీన్‌ జోన్‌గా ప్రకటించింది. ఈనెల 3వ తేదీతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గుడువు ముగియనుండగా, దానిని మరో రెండు వారాల పాటు పొడిగించింది. రెడ్‌ జోన్లలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను కొనసాగనుండగా, గ్రీన్‌ జోన్ల పరిధిలో కొంత అత్యసవర సేవలతో పాటు పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులు, వాటికి అనుబంధమైన రంగాలకు కొంత మినహాయింపులు ఇవ్వనున్నారు. కాగా గ్రీన్‌జోన్‌ విషయంలో ఎక్కువ మొత్తంలోనే మినహా యింపులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి మినహాయింపులు ఉన్నప్పటికీ భౌతిక దూరం, శానిటైజేషన్‌, ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందే.

DO YOU LIKE THIS ARTICLE?