రెండోరోజూ ఉద్రిక్తత

ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థుల నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు
పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయింపు
ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌, టిడిపి నేత సాయిబాబుతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు అరెస్ట్‌
బోర్డు కార్యాలయం గేట్లు మూసివేత

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాలపై రెండో రోజు కూడా ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కొనసాగాయి. మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో బోర్డు కార్యాలయానికి తరలివచ్చారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని నిలువరించారు. దీంతో విద్యా ర్థి సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, టిడిపి నేత సాయిబాబుతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేడియానికి తరలించారు. మంగళవారం రోజంతా ఇంటర్‌ బోర్డు కార్యాల యం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోర్డు కార్యాలయం గేట్లను మూసివేసిన అధికారులు బారికేడ్లతో ఎవరిని రానివ్వకుండా పోలీసు పహారాను తీవ్రతరం చేశారు. సోమవారం నాడు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు తరలిరాగా మంగళవారం నాడు జిల్లాల నుండి కూడా విద్యార్థులు న్యాయం కోసం బోర్డు కార్యాలయానికి తరలిరావడం గమనార్హ ం. నిరసనలు, బైఠాయింపులు, అరెస్టులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఇచ్చిన సమాధానం విద్యార్థులు, తల్లిదండ్రులను సంతృప్తి పరుచలేక పోయింది. అధికారుల తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. అధికారుల తప్పిదాలు, పొరపాట్ల వల్ల ప్రతిభా వంతులైన తమ పిల్లలను ఫెయిల్‌ అయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం నుండే వందల సంఖ్యలో ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని చుట్టి ముట్టి ధర్నాలు, ఆందోళనలు చేయడంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతొందని అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని, బాధ్యు లై చర్య తీసుకోవాలని, రి-వాల్యుయేషన్‌, రి-కౌంటింగ్‌ ఉచితంగా చేయాలని డిమాండ్‌ చేశారు. బోర్డు కార్యాలయంలోకి వెళ్లడానికి ఎవరిని అనుమతించలేదు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిని పోలీసులు లోపలికి అనుమతించారని తెలిమయడంతో విద్యార్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా మరోవైపు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య విచారణ కమిషన్‌ బోర్డు కార్యాలయంలో విచారణ నిర్వహించింది.

DO YOU LIKE THIS ARTICLE?