రెండుచోట్ల సిఎం ఓటు

చట్టరీత్య రేవంత్‌రెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఉల్లంఘిస్తూ ఆపద్ధర్మ సిఎం కెసిఆర్‌ రెండు నియోజకవర్గాల్లో ఓటరుగా పేరును నమో దు చేసుకున్నారని టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తక్షణమే ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సెక్షన్‌ 31 ప్రకారం కెసిఆర్‌పై కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని ఎన్నికల ప్రధాన అధికారిని డిమాండ్‌ చేశారు. కొడంగల్‌లో తనను ఓడించకపోతే రాజకీయాల నుంచి వై దొలుగుతానని ఆపద్ధర్మ మంత్రి కెటిఆర్‌ చేసిన స వాలును స్వీకరిస్తున్నానని, దాని ప్రకారం తాను గె లువకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఒక వేళ తా ను గెలిస్తే, కెటిఆర్‌ రాజకీయాల నుంచి శాశ్వతం గా తప్పుకుని, ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై వి చారణకు ఆయనే స్వయంగా డిమాండ్‌ చేయాలని ప్రతిసవాల్‌ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్‌ సిద్ధిపేట నియోజకవర్గంలోని చింతమడక, గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో రెండు ఓట్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. అందుకు ఆయన ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ లో రెండు చోట్ల కెసిఆ ర్‌ పేరు ఓటర్ల జాబితా లో ఉన్న వివరాలను ఆధారాలుగా చూపించారు. చింత మడక గ్రామంలో కల్వకుం ట్ల చంద్రశేఖర్‌రావు, తండ్రి పేరు రాఘవరావు అని ఉన్నదని, ఎర్రవెల్లిలో చంద్రశేఖర్‌రావు కల్వకుంట్ల, తండ్రి పేరు రాఘవరావు కల్వకుంట్ల అని ఉన్నదని వివరించారు. ఓట్ల ఏరివేత సాఫ్ట్‌వేర్‌కు దొరకొద్దనే ఒక దగ్గర ఇంటిపేరు ముందు, మరో దగ్గర ఇంటి పేరు వెనుక రాశారని ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటరుగా దరఖాస్తు చేసే సమయంలో తమకు ఇతర చోట్ల ఓటు లేదని డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే ఏడాది జైలు శిక్ష, జరిమానా ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది ఓట్లు గల్లంతవ్వడం పట్ల రజత్‌కుమార్‌ స్పందిస్తూ తమ తప్పిదాలు ఉ న్నాయని, అందుకు క్షమించాలని అన్నారని, మరోవైపు సిఎం కెసిఆర్‌వి రెండు చోట్ల ఓట్లు ఉన్నా పట్టించుకోలేదన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కూడా వంద సీట్లు రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్‌ సవాల్‌ విసిరారని, కానీ ఒక్క సీటు తక్కువగా వచ్చిందని గుర్తు చేశారు. ఇటీవల కొడంగల్‌కు వచ్చి అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించకపోతే రాజకీయా ల నుంచి తప్పుకుంటానని కెటిఆర్‌ సవాలు విసిరారని చెప్పారు. తనపై విసిరిన సవాలుకు కట్టుబడి లేకపోతే కెటిఆర్‌ది కల్వంకుట్ల వంశమే కాద ని తెలంగాణ సమాజం భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జాబితా నుంచి అర్హులైన వారి పేర్లను తొలగిస్తున్నారని, తిరస్కరిస్తున్నారని, మరి కొందరికి రెండు, మూడు ప్రాంతాల్లో ఓటు హక్కు ను కల్పించారని మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, చివరకు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. పారదర్శకతతో కూడిన ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్‌ కోర్టును నమ్మించారని, అందుకే ఎన్నికల అధికారుల వివరణ పట్ల కోర్టు కూడా సంతృప్తి వ్యక్తం చేసి ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించిందని తెలిపారు.
ఓట్లు తొలగించినందుకు కారణమైన వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రే వంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. దీనికి బాధ్యుడు సిఇ ఒ రజత్‌కుమార్‌ అని ఒక ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించిన వా రి పేర్లను ఓటరు జాబితా నుంచి కక్ష పూరితంగానే తొలగించారని, ఇలా బూతు స్థాయి నుంచి సుమా రు 100 నుంచి 200 వరకు ఓట్లను తొలగించారని ఆయన ఆరోపించారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకే అనేక తప్పిదాలు చేశారని, దీనిపై తాము ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికారులు పట్టించు కోలేదన్నారు. తప్పిదాల కా రణంగానే 20 లక్షల మంది అర్హులైన వారు ఓటు హక్కును వినియోగంచుకోలేదని ఆవేదన వ్యక్తం చే శారు. సోనియాగాంధీకి జన్మదినోత్సవ బహుమతి గా తెలంగాణ సమాజం ముందస్తుగానే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి బహుమతిగా ఇచ్చారని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

DO YOU LIKE THIS ARTICLE?