రూ. 1500 సాయమేదీ?

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కంటే ముందు రాష్ట్రంలోని పేదలు, కార్మిక కర్షకులు కూలీనాలి చేసుకుని బతికే వారు. కరోనా వైరస్‌ విస్తరణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఈ సమయంలో బీదాబిక్కీ ఇబ్బందులు పడకుండా వారికి పౌరసరఫరాల సంస్థ రేషన్‌ షాపుల నుండి 15 కిలోల బియ్యంతో పాటు రూ. 1500 నగదు కూడా బదిలీ చేస్తామంటూ తెలిపింది. అయితే రేషన్‌ షాపుల ద్వారా బియ్యం అందినా డబ్బులు మాత్రం బదిలీ కాలేదు. దీంతో డబ్బులు రాని వారంతా ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకునేందుకు సంబంధిత రేషన్‌షాపుల వద్దకు వెళ్తే తమకు తెలియదని, మీ ఖాతాల్లోనే ప్రభుత్వం నేరుగా జమ చేస్తుందని రేషన్‌ డీలర్లు చెబుతున్నారు. అటు ఖాతాలో డబ్బులు పడక, ఇటు రేషన్‌ దుకాణదారులు తమకు సంబంధం లేదని తెలియజేస్తుండడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌ వేళ పనులు లేక అల్లాడుతున్న తమకు ప్రభుత్వం ఇచ్చే ఆ 1500 రూపాయలు దేనికో ఆసరా అవుతాయని భావిస్తే ఇలా నిరాశ పరుస్త్తారా? అంటూ వినియోగదారులు రేషన్‌ డీలర్లను, పౌరసరఫరాల శాఖ అధికారులను నిలదీస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయేమోనని ఇప్పటికీ గంపెడాశతో పేదలు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బ్యాంకుల వద్ద రోజూ చాంతాడంత క్యూ ఉంటోందంటే నిరుపేదల్లో ఆ డబ్బు అవసరం ఎంతగా ఉందో చెప్పకనే చెబుతోంది. ఆహార భద్రత కార్డులు తాత్కాలికంగా జారీ చేసినవి కావడం, శాశ్వతంగా కార్డులు లేక పోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చని రేషన్‌ డీలర్లు చెబుతుండగా, దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం స్పందించడమే లేదు. రాజధాని హైదరాబాదులోనే కాదు, జిల్లాల్లోనూ ఖాతాల్లో నగదు జమకాని వినియోగదారులు నిత్యం బ్యాం కుల చుట్టూ తిరుగుతుండడం, అదీ ఎండలో పడిగాపులు కాస్తుండడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.
పోస్టాఫీసుల్లోనా? బ్యాంకుల్లోనా?
రేషన్‌తో పాటు ఇస్తున్న రూ. 1500 నగదు తమ ఖాతాల్లో జమ కాలేదంటూ వినియోగదారులు బ్యాంకు మేనేజర్లను కలువగా ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా జమ చేస్తోందని కొందరు చెబుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. తీరా పోస్టాఫీసు వద్దకు వెళ్లి అడిగితే మీ పేరిట నగదు తమకు జమ కాలేదని, బ్యాంకుల్లోనే తెలుసుకోండని వారు ఉచిత సలహా ఇస్తున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ సరుకులు క్రమం తప్పకుండా తీసుకున్న వారికే నగదు జమ అయ్యిందని, మూడు మాసాల నుండి నెలలు అంతకంటే ఎక్కువ మాసాలు రేషన్‌ సరుకులు తీసుకోకుంటే ఇక నగదు జమ కాదని పౌర సరఫరాల శాఖ అధికారులు సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వం వేసిన రూ. 1500 నగదు

DO YOU LIKE THIS ARTICLE?