రాష్ట్రంలో మరో ఆరు కరోనా మరణాలు

63కు చేరిన మృతుల సంఖ్య
ప్రజాపక్షం / హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందు లో తెలంగాణకు చెందిన వారు 39 మంది మాత్రమే ఉండగా, వలస వచ్చిన 19 మందికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో 49 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2098కి చేరింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు. అలా వచ్చిన కొందరిలో వైరస్‌ వెలుగు చూస్తుండడంతో వీరి సంఖ్యను వేరుగా చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1842కి చేరగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 297 మందికి ఇప్పటి వరకు ఈ వైరస్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో వలస వచ్చిన వారు 173 మంది కాగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారు 94 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 30 మంది ఉన్నారు. రాష్ట్రంలో మరో ఆరుగురు ఈ వైరస్‌ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 63కు చేరింది. ఇప్పటి వరకు 1321 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 714 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు గాని జిల్లాలుగా కొనసాగుతున్నాయి. గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు ఇటీవల వరకు 26 ఉండగా, ఆ సంఖ్య 20కి తగ్గింది. కొత్త జిల్లాలకు కూడా వైరస్‌ మళ్లీ వ్యాపించింది.

DO YOU LIKE THIS ARTICLE?