రాష్ట్రంలోనే బుల్లి పంచాయతీ

34 ఓట్లతో దొంగతోగు పంచాయతీ ఏర్పాటు
300లోపు ఓట్ల పంచాయతీలు వందల్లో

ప్రజాపక్షం/ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల నూతనంగా పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గ్రామపంచాయతీ లు ఏర్పాటు చేయడంతో చిన్నచిన్న పంచాయతీలు ఏర్పాడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని దొంగతోగును ఇటీవల పంచాయతీగా ఏర్పాటు చేశారు. గతంలో గుండాల పంచాయతీలో ఉండేది. ఇది పంచాయతీలో ఉండేది. గుండాల మం డల కేంద్రానికి దగ్గర ఉన్నప్పటికినీ మండల విభజనలో దొంగతోగు గ్రామాన్ని ఆళ్లపల్లి మండలంలో చేర్చారు. గుండాల గ్రామానికి దొంగతోగు గ్రామానికి మధ్యలో కిన్నెరసాని నది ఉండడంతో నది ఇవతల గ్రామాలన్నింటినీ ఆళ్లపల్లిలో చేర్చారు. దొంగతోగు గ్రామ జనాభా 45 మంది కాగా, ఓటర్లు 34 మం ది. ఈ గ్రామానికి 10కిలో మీటర్ల పరిధిలో ఏ గ్రామం లేకపోవడం వల్ల దీనిని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. మొత్తం 34 మంది ఓటర్లలో 17 మంది పురుషులు, 17 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం నాలుగు వార్డులుగా విభజించారు. ఇక్కడ 18 ఓట్లు పొందితే చాలు ముఖాముఖిలో సర్పంచ్‌గా ఎన్నిక కావచ్చు. ఒకవేళ బహుముఖ పోటీ జరిగితే ఐదారు ఓట్లు ఉన్నా సర్పంచ్‌ అ య్యే అవకాశం ఉంది. ఇదే మండలంలో అడవిరామవరం గ్రామ పంచాయతీలో కేవ లం 62 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇది కూ డా రాఘవాపురం నుంచి విడివడి నూతన పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామంలో 30మంది పురుషులు, 32 మంది స్త్రీలు ఉం డగా నాలుగు వార్డులుగా విభజించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పుసుకుంట గ్రామంలో 224 మం ది ఓటర్లు ఉన్నారు. ముగ్గురు మినహా మిగిలిన వారంతా గిరిజనులే. పుసుకుంట గ్రా మపంచాయతీలో కటుకూరు అనే గ్రామం కూడా ఉండడం రెండు గ్రామాలు కలిపి 234 ఓట్లు ఉన్నా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం విశేషం

DO YOU LIKE THIS ARTICLE?