రామ మందిరంపై బిజెపికి శివసేన అల్టిమేటం

ముంబయి: అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుటిలోగా పూర్తి అవుతుందో బిజెపి స్పష్టతనివ్వాలని శివసేన డిమాండ్ చేసింది. మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ జారీ, ఆలయ నిర్మాణ తేదీలపై క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది. శుక్రవారం ఈ మేరకు ఆ పార్టీ పత్రిక సామ్నాలో ఓ వ్యాసాన్ని ప్రచురితమైంది. ఈ సందర్భంగా శివసేన రామ మందిర నిర్మాణం ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ బిజెపిపై విరుచుకుపడింది. బిజెపి అయోధ్య అంశంపై మాట్లాడడం కాదు… అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతలో శివసైనికులుండడం అధికారంలో ఉన్న వారు గర్వించాలని పేర్కొంది. రామ మందిరంపై తామేమి రాజకీయాలు చేయడం లేదని.. కానీ, అయోధ్యలో మందిరం నిర్మించాలనేదే తమ అభిమతమని తెలిపింది. నవంబర్ 25వ తేదీన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే అయోధ్యను సందర్శిస్తారని, ఈ పర్యటన కేవలం అయోధ్య ఆలయ నిర్మాణ పనులు ముందుకు వెళ్లేలా తోడ్పాడును అందించేలా మాత్రమే ఉంటాయని చెప్పింది. అయితే శివసేన నేతలు అయోధ్యకు వెళ్లితే అధికారంలో ఉన్న పార్టీకి కలవరం మొదలైందని… తమ పర్యటనల వల్ల వారికెందుకు కడుపు నొప్పిగా ఉందో అర్థం కావడం లేదన్నారు. శివసేన ‘ఛలో అయోధ్య’కు పిలునివ్వలేదని… అదేమి ప్రైవేట్ స్థలం కాదని, ఆలయ దర్శనం కోసమే వెళ్తామని తెలిపింది. అయోధ్యలో ఇప్పుడేం రామ రాజ్యం లేదని.. అంతా సుప్రీంకోర్టుదే రాజ్యమని పేర్కొంది. అయితే 1992లో బాబా సాహెబ్ యొక్క శివసైనికులు బాబర్ రాజ్యాన్ని కూల్చివేశారని, అలాంటీ శివ సైనికులను చూసి అధికార పార్టీ భయపడడం కాదు.. గర్వపడాలని పేర్కొంది. ఇప్పటికైనా బిజెపి రామ మందిర నిర్మాణంపై ఓ తేదీని ఖరారు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ఒకవేళ ఆలయ నిర్మాణ అంశం అధికార పార్టీ నేతల చేతుల్లో నుంచి జారిపోతే… చాలా మంది జీవనోపాధికి ఇబ్బందులు కల్గడమే కాకుండా, వారి ఆక్షాంక్షలు నేరవేరకుండా నోళ్లు మూతపడుతాయని హెచ్చరించింది.

DO YOU LIKE THIS ARTICLE?