‘రాఫెల్‌’పై తీర్పు రిజర్వ్‌

ముగిసిన వాదనలు
గత తీర్పును పక్కనబెట్టాలన్న సిన్హా, శౌరి, భూషణ్‌

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో నేర విచారణ జరపాలని తాము పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసిన గత తీర్పును పక్కనబెట్టాలని మాజీ కేంద్ర మం త్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టును శుక్రవారం అర్థించారు. కాగా ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం రివ్యూ పిటిషన్లపై తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందాన్ని సవాలుచేస్తూ వారు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను 2018 డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టు కొట్టేసిందన్నది ఇక్కడ గమనార్హం.
కొత్త నిజాలు బయటికి రావల్సి ఉంది: ప్రశాంత్‌ భూషణ్‌
రాఫెల్‌ వ్యవహారంపై ధర్మాసనం ఎదుట తొ లుత వాదనలు వినిపించిన ప్రశాంత్‌ భూ షణ్‌, కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ ఒప్పందంలో కంటికి కనబడని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని, కొత్త నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. ‘కాగ్‌’ నివేదికలో రాఫెల్‌ యుద్ధ విమానాల ధరలను సరిచేయాలని నివేదిక రాకముందే ప్రభుత్వం ఎలా చెప్పిందని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందెన్నడూ రక్షణ శాఖలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. కీలకమైన సమాచారాన్ని ప్రభుత్వం కోర్టుకు ఇవ్వలేదని, ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా కోర్టు డిసెంబర్‌ 14న తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.
8 కీలక నిబంధనలను పక్కన పెట్టి రాఫెల్‌కు సంబంధించిన సిసిఎస్‌ సమావేశం నిర్వహించారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. రాఫెల్‌ ఒప్పందంలో కీలక నిబంధనలు పక్కన పెట్టిన విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలపలేదన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ ఆ అంశాలు లేవన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?