రాణించిన కెప్టెన్‌ స్మిత్‌

మెరిసిన రియాన్‌పరాగ్‌..
రాజస్థాన్‌ ఖాతాలో మూడో విజయం
ఐదు వికెట్లతో ముంబయి ఇండియన్స్‌ చిత్తు
జైపూర్‌ : ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్‌ మరోసారి పైచేయి సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌ జట్టు ముంబయిను ఓడించిన విషయం తెలిసిందే. లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్‌లో అజింక్యా రహానే(12) విఫలమైనప్పటికీ, కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(59 నాటౌట్‌; 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌) బాధ్యతాయుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా రియాన్‌ పరాగ్‌ (43; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌) మెరుపులు మెరిపించాడు. మరోవైపు సంజూ శాంసన్‌(35; 19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర్వాలేదనిపించడంతో రాజస్థాన్‌ అవలీలగా విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ జట్టుకు ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహించాడు.
స్మిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌..
162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అజింక్యా రహానే (12) పరుగులు చేసి రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్‌ 39 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం సంజూ శాంసన్‌, కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. స్మిత్‌ కుదురుగా ఆడుతుంటే సంజూ మాత్రం చెలరేగి ఆడాడు. ముంబయి బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల వర్షం కురిపించాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో శాంసన్‌ 19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 పరుగులు చేసి తన వికెట్‌ను కోల్పోయాడు. తర్వాత వచ్చిన బెన్‌ స్టోక్స్‌ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరడంతో రాజస్థాన్‌ 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. ఈసమయంలో యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌తో కలిసి స్మిత్‌ రాజస్థాన్‌ను ఆదుకున్నాడు. ఇద్దరూ చక్కగా బ్యాటింగ్‌ చేస్తూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌ 12.4 ఓవర్లలో 100 పరుగుల మైలురాయిని దాటింది. తర్వాత పరాగ్‌ దూకుడు పెంచి బౌండరీలు బాదడం మొదలెట్టాడు. మరోవైపు బాధ్యతగా ఆడుతున్న స్మిత్‌ 40 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే జట్టు స్కోరు 147 పరుగుల వద్ద విజృంభించి ఆడుతున్న రియాన్‌ పరాగ్‌ (43; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రనౌటయ్యాడు. తర్వాత వచ్చిన అష్టన్‌ టర్నర్‌ (0) కూడా వెంటనే వెనుదిరగడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్‌ స్మిత్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో చివరి వరకు అజేయంగా ఉండి తమ జట్టును విజయతీరానికి చేర్చాడు. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 162/5 పరుగులు చేసి సీజన్‌ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన స్టివ్‌ స్మీత్‌ (59) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో దీపక్‌ చాహర్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో బుమ్రా ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.
ఆరంభంలోనే షాక్‌..
టాస్‌ ఓడి ముందు బ్యాటింగ్‌ చేసిన ముంబయికి ఆరంభం కలిసి రాలేదు. మూడో ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (5) పరుగులు చేసి శ్రే యస్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అ ండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దాంతో ముంబ యి జ ట్టు 11 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అన ంతరం సుర్యకుమార్‌తో కలిసి మరో ఓపెనర్‌ డికా క్‌ ముంబయి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. వీరిద్ద రూ మరో వికెట్‌ చేజారకుండా జాగ్రత్తగా ఆడు తూ ముందుకు సాగారు. సింగిల్స్‌, డబుల్స్‌తో పా టు అవకాశం చిక్కినప్పుడల్ల చెత్త బంతులను బౌం డరీలకు తరలిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. సుర్యకుమార్‌ ఆచితూచి ఆడుతుంటే.. డికాక్‌ మాత్రం చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే ముంబయి 6.4 ఓవర్లలో 50 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. ఈ జోడీని విడదీయడానికి రాజస్థాన్‌ బౌల ర్లు ఎంతగానో ప్రయత్నించినా ఫలిత దక్కలేదు. మరోవైపు ధాటిగా ఆడుతున్న ఓపెనర్‌ డికాక్‌ 34 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో హఫ్‌ సెంచ రీ నమోదు చేసుకున్నాడు. ప్రమాదకరమైన ఈ జంటను విడదీయడానికి చేస్తున్న ప్రయత్నం ఆఖరికి 14 ఓవర్‌లో ఫలించింది. సుర్యకుమార్‌ (34; 33 బంతుల్లో 1 ఫోర్‌; 1 సిక్స్‌)ను స్టూవర్ట్‌ బిన్నీ పెవిలియన్‌ పం పాడు. దాంతో ముంబయి జట్టు 108 పరుగుల వద్ద రెండో వికెట్‌ కో ల్పోయింది. తర్వాత మరో మూడు పరుగుల వ్యవధిలోనే కీలక ఇన్నిం గ్స్‌ ఆడుతున్న డికాక్‌ (65; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) గోపాల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతరం హిట్టర్‌ హార్దిక్‌ పాండ్య విజృంభించి ఆడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. వేగంగా ఆడుతున్న హార్దిక్‌ చివరికి 15 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌ సహాయంతో 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు కీరన్‌ పొలార్డ్‌ (7 బంతుల్లో 10), బెన్‌ కట్టింగ్‌ (13 నాటౌట్‌)లు ధాటిగా ఆడడంతో ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ నాలుగు ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో స్టూవర్ట్‌ బిన్నీ, జోఫ్రా ఆర్చర్‌, యజ్‌దేవ్‌ ఉనద్కాట్‌లు తలో వికెట్‌ తీశారు.

DO YOU LIKE THIS ARTICLE?