రాజ్యాంగ సంస్థల విధ్వంసం

అంతర్యుద్ధాన్ని తలపిస్తున్న బెంగాల్‌-సిబిఐ ఉదంతం

ఒకే రీతిలో స్పందిస్తున్న మోడీ, మమత సర్కార్లు : కోల్‌కతాలో ఉద్రిక్తత
కొనసాగుతున్న మమత నిరసన దీక్ష
మోడీపై నిప్పులు చెరిగిన ప్రతిపక్షం
దద్దరిల్లిన పార్లమెంట్‌
ఉభయ సభలు నేటికి వాయిదా

న్యూఢిల్లీ: కోల్‌కతాలో నెలకొన్న సిబిఐ వివా దం సోమవారం పార్లమెంటు ఉభయసభలను దద్దరిల్లింపజేసింది. పశ్చిమబెంగాల్‌లో జరిగింది అనూహ్య పరిణామం’ అని, చర్యలు తీసుకోడానికి కేంద్ర ప్రభుత్వాని కి అధికారాలు ఉన్నాయని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వాతావరణం సద్దుమణగలేదు. పదేపదే వాయిదాలతో చివరికి ఉభయసభలు మరునాటికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుల నిరసనలకు కాంగ్రెస్‌, బిజెడి, ఎన్‌సిపి, ఎస్‌పి, ఆర్‌జెడి సభ్యులు కూడా తోడయ్యారు. సిబిఐని నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని వా రంతా అన్నారు. ఇదిలా ఉండగా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో కోల్‌కతా పోలీస్‌ చీఫ్‌ను సిబిఐ ప్రశ్నించడానికి యత్నించడంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, టిఎంసి నాయకురాలు మమతా బెనర్జీ కోల్‌కతాలో ఆదివారం నుంచి నిరసన ప్రదర్శనకు కూర్చున్నారు. కోల్‌కతా పోలీస్‌ చీఫ్‌ రాజీవ్‌ కుమార్‌ను ప్రశ్నించడానికి లౌడన్‌ స్ట్రీట్‌ ప్రాంతంకు వెళ్లిన సిబిఐ బృందానికి అనుమతి ఇవ్వకుండా, వారిని జీపులోకి ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. లోక్‌సభలో టిఎంసి స భ్యులు నిరసనలు చేస్తుండగానే హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇది ‘అనూహ్య పరిణామం, సిబిఐ అధికారులను విధులను నిర్వహించకుండా అడ్డుకున్నారు’ అని అన్నా రు. ప్రశ్నించాలనుకుంటుంటే రాజీవ్‌ కుమార్‌ సహకరించడంలేదు’ అని కేంద్రం తొలి స్పందనలో రాజ్‌నాథ్‌ చెప్పారు. ‘పశ్చిమబెంగాల్‌లో రాజ్యాంగ విచ్ఛినత ఏర్పడే అవకాశం ఉంది… ఏ ప్రాంతంలోనైనా సాధారణ స్థితిని నెలకొల్పడానికి కేంద్రానికి రాజ్యాంగపరంగా అధికారం ఉంది’ అని కూడా ఆయన వివరించా రు. ‘ఆదివారం జరిగింది రాజ్యాంగ విచ్ఛితికి సూచన’ అని చెప్పారు. ఈ విషయంపై ఆ రాష్ట్ర గవర్నర్‌ నివేదికను కూడా కోరామన్నారు. దర్యాప్తు సంఘాలు తమ విధులు నిర్వహించడానికి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించాల్సి ఉందని కూడా రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

మమతాబెనర్జీ ధర్నా

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఇంటి వద్ద ధర్నాకు కూర్చున్నారు. కేంద్రం అధికారాన్ని దుర్వినియోగం చే స్తోందని ఆమె ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా చేతిలో తన కు అవమానం కలిగిందని అన్నారు. ‘దేశ రా జ్యాంగాన్ని రక్షించేందుకు తాను ఆందోళన చేపడతాను’ అని ఆమె పేర్కొన్నారు. కేంద్రానికి, ప శ్చిమ బెంగాల్‌కు మధ్య తలెత్తిన ఘర్షణ ప్రభా వం వివిధ రాష్ట్రాల రాజధానుల్లో కూడా కనిపించింది. బిజెపి వ్యతిరేక పార్టీలు, నాయకులు మ మతా బెనర్జీకి మద్దతు పలికారు. ‘ఇది సత్యాగ్ర హం. దేశాన్ని రకించేంత వరకు…రాజ్యాంగాన్ని పరిరక్షించేంత వరకు నేను దీనిని కొనసాగిస్తాను’ అని మమతా బెనర్జీ నిరసన చేపట్టిన చోట విలేకరులతో అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రధాని మోడీ, బిజెపి చీఫ్‌ అమిత్‌ షా దిష్టి బొమ్మలను వీధుల్లో తగులబెట్టారు. కాగా హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘పశ్చిమ బెంగాల్‌ లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తాయని, ఇది రాజ్యాంగ విచ్ఛినానికి సూచన’ అని చెప్పారు. ఆయన గవర్నర్‌ కేశరి నాథ్‌ త్రిపాఠి నుంచి నివేదికను కూడా కోరారు. కాగా రాజ్‌భవన్‌ నివేదిక ను వెంటనే పంపిందని తెలిసింది. కానీ అందులో ఏముందో వెల్లడి కాలేదు. ప్రభుత్వమే శా రదా గ్రూపు చైర్మన్‌ సుదిప్త సేన్‌ను అరెస్టు చేసిందని, మోసపోయిన డిపాజిటర్లకు రూ.250-300 కోట్లు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకుందని మమతా బెనర్జీ చెప్పారు. ‘దోషులను, దొంగలను అరెస్టు చేయడంలో సాయపడిన పోలీస్‌ కమిషన ర్‌ రాజీవ్‌ కుమార్‌ను మీరు దొంగ అంటున్నారు. ఎవరి డబ్బు ఆయన దొంగిలించారు? మీరు న న్ను కూడా దొంగ అంటున్నారు. ఎవరి డబ్బు నే ను కాజేశాను? నిజాయితీగా పనిచేసేవారికీ మీ రు దొంగ ముద్ర వేస్తున్నారు’ అని ఆమె ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘నా జీవితంలో నేను నిరంతరం పోరాడుతూ వచ్చాను. ఎలాంటి పరిణామాలకు వెరిచేదిలేదు’ అని ఆమె చెప్పుకొచ్చా రు. శారదా కుంభకోణంలో రూ. 4,000 కోట్లు, రోజ్‌ వ్యాలీ కుంభకోణంలో రూ. 15,000 కోట్ల ను ప్రమోటర్లు స్వాహా చేశారని ఆరోపణ. ఈ రెం డు కుంభకోణాల వల్ల పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, అసోం, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలోని లక్షలాది డిపాజిటర్లను మోసగించారని ఆరోపణ. ఈ కుంభకోణాల్లో టిఎంసికి చెందిన నాయకులకు సంబంధాలున్నాయని వాదన. కాగా పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీకి ఆంధ్రప్రదేశ్‌, క ర్ణాటక, తమిళనాడు నాయకుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ‘ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయి’అని మాజీ ప్రధాని హెచ్‌డి దేవె గౌడ అన్నారు. ‘ప్రతిపక్షాల ర్యాలీ నిర్వహించినందుకు మమతపై బిజెపి ప్రభుత్వం ప్రతీకారంతో చర్య లు తీసుకుంటోంది’ అని అమరావతిలో ఎపి సిఎం నాయుడు అన్నారు. ‘ప్రతి స్వ తంత్ర సంస్థను బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తోం ది. నేను దీదీ(మమతా బెనర్జీ)కి అండగా ఉన్నా ను. దేశంలో ఫెడరల్‌ వ్యవస్థను రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాడతాను’ అంటూ స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తక్షణమే అఖిలపక్షం

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మోడి ప్రభుత్వం
కేంద్రంలో నరేంద్ర మోడి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగ పరుస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌ లో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందిస్తూ మోడి ప్రభుత్వం సిబిఐ, ఇడి, ఐటి వంటి సంస్థలను రాజకీయంగా తమ ప్రత్యర్థులను లక్ష్యంగా వాడుకుంటోందని అన్నారు. ఈ మేరకు సోమవారం సుధాకర్‌ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మోడి ప్రభుత్వంతో పాటు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జి ప్రభుత్వం కూడా అదే విధంగా అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందన్నారు. శారధ చిట్‌ ఫండ్‌ కుంభకోణంలో నిందితులను కాపాడేందుకు మమత ప్రభుత్వం ప్రయత్నించడంతో నేడు దేశంలో సివిల్‌ వార్‌ పరిస్తిథి నెలకొందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. శారధ కుంభకోణంపై నిస్పక్షపాతంగా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం, రాస్ట్రాల మధ్య సంబంధాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని పిలువాలని సుధాకర్‌ రెడ్డి కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?