రాజ్యసభ సభ్యులుగా కెకె, సురేష్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్‌ కె.కేశవరావు,ఉమ్మడి ఎపి మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేష్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారంశాసనసభ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నర్సింహాచార్యుల చేతుల మీదుగా కేశవరావు, సురేశ్‌రెడ్డిలు నియామక పత్రాలను అందుకున్నారు. వారి వెంట ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉన్నారు. కాగా పోటీలో ఎవ్వరూ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కె.కేశవరావు ఇది వరకే సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యులుగా ఉండగా కాంగ్రెస్‌కు చెందిన కె.వి.పి.రామచందర్‌రావు పదవి కాలం ముగియడంతో ఆ స్థానం కూడా టిఆర్‌ఎస్‌ కే దక్కింది. దీంతో తెలంగాణకు రాజ్యసభలో కేటాయించిన మొత్తం ఏడు స్థానాలూ టిఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉ న్నట్లయింది.అయితే టిఆర్‌ఎస్‌ సభ్యులుడి. శ్రీనివాస్‌కు, ఆ పార్టీకి సంబంధాలు దెబ్బతిన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?