రాజ్యసభ సభ్యునిగా గొగోయ్‌ని నామినేట్‌ చేయడం అనైతికం

ప్రజాపక్షం/హైదరాబాద్‌: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయ్‌ను రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేయడం అనైతికమని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. అయోధ్య, రాఫెల్‌పై ఆయన ఇచ్చిన తీర్పులను ఇప్పుడు మరింత క్లిష్టతను పరిశీలించాల్సి ఉంటుందని ఆయనన్నారు. ఇది చెడు సాంప్రదాయమన్నారు. రిటైర్మెంట్‌ అనంతరం ఆకర్శణీయమైన ఉద్యోగం, రివార్డు అనేది ప్రస్తుతం పనిచేస్తున్న జడ్జీలకు సందేశం ఇచ్చే విధంగా ఉందని ఇది న్యాయ వ్యవస్థ స్వాతంత్రానికి దిగ్భ్రాంతికరమైన దెబ్బ అని ఆయనన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?