రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా అప్టన్‌

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ తమ కొత్త కోచ్‌ను ఆదివారం ఎంపిక చేసింది. భారత మాజీ మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌ పాడీ అప్టన్‌ను కొత్త కోచ్‌గా నియమించింది. అయితే అప్టన్‌ ఇంతకుముందు కూడా రాజస్థాన్‌ రాయల్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. నాలుగు సీజన్‌లలో ఆయన ఆర్‌ఆర్‌ జట్టుకు సేవలు అందించారు. ఇతని హయాంలో రాయల్స్‌ 2013 సీజన్‌లో సెమీస్‌కు చేరింది. అప్టమ్‌ కోచ్‌గా ఉన్నప్పుడు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తమ హోమ్‌ గ్రౌండ్స్‌లో వరుసగా 13 సార్లు విజయాలు సాధించింది. ఆప్టన్‌కు అంతర్జాతీయంగా కోచింగ్‌లో మంచి అనుభువం ఉంది. ఐపిఎల్‌తో పాటు బిగ్‌బాష్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లలో కూడా ఈయన కొన్ని జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. బిగ్‌బాష లీగ్‌లో సిడ్నీ థండర్స్‌కు నాలుగేళ్లపాటు మార్గనిర్దేశకుడిగా సేవలు అందించారు. 2016లో ఈయన హయాంలోనే సిడ్నీ థండర్స్‌ విజేతగా కూడా నిలిచింది. 2011లో భారత జట్టు ప్రపంచకప్‌ గెలుచుకున్న సమయంలో అప్టన్‌ టీమిండియాకు మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌గా ఉన్నారు. భారత జట్టు టెస్టుల్లో కూడా ప్రపంచ నెంబవర్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?