రాజకీయ ప్రత్యర్థులు రాజద్రోహులు కాదు

నరేంద్ర మోడీకి అద్వానీ చురకలు

ప్రతిపక్షాలను పదేపదే పాక్‌ ఏజెంట్లుగా పిలుస్తున్న మోడీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచన

న్యూఢిల్లీ: బిజెపి తరఫున లోక్‌సభకు పోటీకి నిలుపకుండా ఉంచేసిన కొన్ని రోజులకు బిజెపి ప్రముఖ నేత ఎల్‌కె అద్వానీ గురువారం తన బ్లాగ్‌లో కాషాయ పార్టీ వైఖరిని విమర్శించారు. బిజెపి ఎంచుకునే స్వేచ్ఛ గురించి నొక్కి చెబుతుందని, దానితో రాజకీయంగా విభేదించేవారిని ‘జాతి వ్యతిరేకులు’గా ముద్రవేయబోదని రాశారు. సాంప్రదాయిక గాంధీనగర్‌ సీటు నుంచి తనను కాక తన స్థానంలో అమిత్‌ షాను పోటీకి నిలబెట్టిన తర్వాత తొలిసారిగా ఈ 91 ఏళ్ల ఈ బిజెపి నాయకుడు మాట్లాడారు. ‘బిజెపి ఏర్పడినప్పటి నుంచే రాజకీయంగా తమతో సమ్మతించని వారిని మా ‘శత్రువులుగా’ చూడలేదు, కానీ తమ వ్యతిరేకులుగానే పరిగణించింది. ఇదేవిధంగా భారత జాతీయతావాదం విషయానికొస్తే, మాతో రాజకీయంగా ఏకీభవించని వారిని ‘జాతి వ్యతిరేకులు’గా చూడలేదు. ప్రతి పౌరుడి స్వేచ్ఛాయుత ఎంపికకు పార్టీ కట్టుబడి ఉంది. అది వ్యక్తిగతంగానైనా సరే, రాజకీయంగానైనా సరే’ అని ఆయన తన బ్లాగ్‌ లో రాశారు. ఏప్రిల్‌ 6న జరగనున్న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ముందు ఆయన ఇలా తన బ్లాగులో రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా జాతీయ భద్రతను ఎన్నికల కీలకాంశంగా చేయడం, రాజకీయ ప్రత్యర్థులను పాకిస్థానీల మాదిరి భారత్‌ వ్యతిరేకులని మాట్లాడుతున్న నేపథ్యంలో అద్వానీ అభిప్రాయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అనేక మంది బిజెపి నాయకులు సైతం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు ‘జాతివ్యతిరేకులు’ అనే పదా న్ని తరచూ ఉపయోగిస్తున్నారు. 1991 నుంచి తనను పార్లమెంటుకు ఆరుసార్లు పంపినందుకు అద్వానీ గాంధీనగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ‘గాంధీనగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఈ సందర్భాన్ని వాడుకుంటున్నాను. వారు 1991 నుంచి నన్ను ఆరు సార్లు పార్లమెంటుకు పంపించారు.

DO YOU LIKE THIS ARTICLE?