రసెల్‌, గిల్‌ విధ్వంసం

ముంబయి లక్ష్యం 233
కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా ముంబయితో జ రిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లు ఆండ్రీ రసెల్‌ (80నాటౌట్‌; 40 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు), శుభ్‌మాన్‌ గిల్‌ (76; 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించారు. దాం తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభ్‌మాన్‌ గిల్‌, క్రిస్‌ లీన్‌ (54; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభా న్ని అందించారు. అనంతరం జట్టు స్కోరు 96 వద్ద చెలరేగి ఆడుతున్న లీన్‌ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన మరో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ రసెల్‌తో కలిసి గిల్‌ నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. ఈ ఇద్ద రూ బ్యాట్స్‌మెన్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో స్కోరుబోర్డుపై పరుగుల వరద పారింది. ఆఖరికి విజృంభించి ఆడుతున్న యువ ఆటగాడు గిల్‌ 76 పరుగులు చేసి హార్దిక్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత దినేశ్‌ కార్తీక్‌ (15 నాటౌ ట్‌) అండతో చెలరేగి పోయిన రసెల్‌ ఆఖరికి (80) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

DO YOU LIKE THIS ARTICLE?