మోడీ దేశద్రోహి

అనిల్‌ అంబానీకి దళారీగా వ్యవహరించిన ప్రధాని
అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారు
రాఫెల్‌ ఒప్పందానికి కొన్ని రోజుల ముందే అంబానీకి ఇ-మెయిల్‌
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానీకి ప్రధాని నరేంద్ర మోడీ ‘మధ్యవరి’్తగా వ్యవహరించి, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి దేశద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం ఆరోపించారు. భారత్‌, ఫ్రాన్స్‌ సంతకాలు చేయడానికి కొన్ని రోజుల ముందే ఆ విష యం వ్యాపారవేత్త అనిల్‌ అంబానీకి తెలుసునని, ఓ ఇ-మెయిల్‌ను ఉటంకించారు. అయితే ఈ ఆరోపణను బిజెపి తిరస్కరించింది. ఆ ఇ-మెయిల్‌ ఎయిర్‌బస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రస్తావించిన హెలికాప్టర్‌ ఒప్పందానికి చెందిదే తప్ప రాఫెల్‌ ఒప్పందానికి చెందింది కాదని వాదించింది. సబ్జెక్ట్‌ లైన్‌లో ‘అంబానీ’ అని పేర్కొం టూ ముగ్గురు స్వీకరణకర్తలకు ఎయిర్‌బస్‌ ఎగ్జిక్యూటివ్‌ నికోలస్‌ ఛాముస్సీ 2015 మార్చి 28న ఆ ఇ-మెయిల్‌ రాశారు. దానిని రాహుల్‌ గాంధీ మీడియాకు విడుదలచేశారు. నాటి ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి జీన్‌-వైవ్స్‌ లే డ్రియన్‌ను అనిల్‌ అంబానీ కలిశారని, ‘ప్రధాని సందర్శన(ఫ్రాన్స్‌కు) సందర్భంలో సంతకాలకు అవగాహన పత్రం తయారవుతున్నట్లు’ పేర్కొన్నారని ఆ ఇ-మెయిల్‌లో ఉందని రాహుల్‌ గాంధీ తెలిపారు. విదేశాంగ కార్యదర్శి ఎస్‌. జైశంకర్‌కు, నాటి రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌కు కూడా సమాచారం  అందక ముందే ఆ విషయం అనిల్‌ అంబానీకి ఎలా తెలిసిందని రాహుల్‌ ప్రశ్నించారు. ‘ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన. ఒప్పందం గురించి ముందుగా ప్రధానికి మాత్రమే తెలుసు. దానిని ఆయన అనిల్‌ అంబానీకి తెలిపారు. అనిల్‌ అంబానీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు’ అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘ఇది దేశద్రోహం. గూఢచారులు చేసే పనిని మోడీ చేస్తున్నారు. రక్షణ విషయాలను ఆయన వేరొకరికి తెలుపుతున్నారు. అధికారిక రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేసిన ఆయనే వాటి ఉల్లంఘనకు పాల్పడుతున్నారు’ అన్నారు.ఈ విషయంలో నేర దర్యాప్తు జరపాలని రాహుల్‌ కోరారు. అయితే రాఫెల్‌ ఒప్పందంకు సంబంధించిన అన్ని ఆరోపణలను ప్రభు త్వం, అంబానీ పదేపదే ఖండించారు. పత్రికా సమావేశంలో రాహుల్‌ గాం ధీ ఇ-మెయిల్‌ చదివి వినిపించారు. అంబానీ రక్షణ మంత్రిత్వ శాఖకు వెళ్లి ఎయిర్‌బస్‌తో వాణిజ్య హెలికాప్టర్లు, తర్వాత రక్షణ విషయాల్లో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ‘ఇది ఒక రకంగా రక్షణ రహస్యాలను బయటపెట్టడమే… ప్రధాని దేశ భద్రత విషయంలో రాజీపడ్డారు. గూఢచారులు చేసే పనిని ఆయన చేశారు. ఎవరికి తెలుపకూడదో వారికి ఆయన రక్షణ విషయాలు చెప్పారు’ అని గాంధీ ఆరోపించారు. విలేకరులు సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుకు మీరెందుకు అనుమతించరు…కావాలనుకుంటే మీరు మాపై ఎంతైన దర్యాప్తు చేసుకోవచ్చు’ అన్నారు. రాఫెల్‌ ఒప్పందంపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తిరస్కరించారు. పైగా ‘కాగ్‌’ నివేదికను ‘చౌకీదార్‌ ఆడిటర్‌ జనరల్‌’ నివేదిక అంటూ ఎద్దేవా చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?