మోడీ ఆగడాలకు లొంగే ప్రసక్తే లేదు

ధర్నా విరమించిన అనంతరం మమత స్పష్టీకరణ
మమత మహాకూటమి రూపశిల్పి : చంద్రబాబు

కోల్‌కతా: పోంజీ కుంభకోణం కేసుల్లో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను ప్రశ్నించడానికి సిబిఐ ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం దానిని విరమించారు. ‘కోర్టు ఉత్తర్వు అనుకూలంగా రావడం’, వివిధ ప్రతిపక్ష నాయకులను సంప్రదించాక ఆమె తన ధర్నాను చివరికి విరమించారు. మమతా బెనర్జీ ఆదివారం రాత్రి నుంచి ధర్నాకు కూర్చున్నారు. మంగళవారం ఆ ధర్నా మూడో రోజుకు చేరుకున్నాక ఆమె దానిని విరమించారు. ఇదివరలో సింగూరులో 2006లో టాటా మోటార్స్‌ కంపెనీ రైతుల భూమిని సేకరించినప్పుడు కూడా ఆమె స్పాట్‌లోనే 26 రోజులపాటు నిరాహారదీక్ష చేపట్టారు. మమతా బెనర్జీ తాజాగా చేపట్టిన ధర్నా ప్రదేశానికి టిడిపి చీఫ్‌ చంద్రబాబు నాయుడు, ఆర్‌జెడి నాయకుడు తేజస్వీ యాదవ్‌, డిఎంకె నాయకురాలు కనిమొళి వెళ్లి పరామర్శించారు. షిల్లాంగ్‌లో సిబిఐ ఎదుట హాజరవ్వాలని, నిర్ణయించిన తేదీలో శారదా చిట్‌ఫండ్‌ కేసు దర్యాప్తులో సహకరించాలని సుప్రీంకోర్టు మంగళవారం రాజీవ్‌ కుమార్‌ను ఆదేశించిన తర్వాత మమతా బెనర్జీ తన ధర్నాను విరమించారు.
బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్న బిజెపి: మమత
ప్రజలను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి బిజెపి సిబిఐను వాడుకుంటోందని, త ర్వాత లొంగిన వారిని తన పార్టీలోకి లాక్కుంటోందని పశ్చిమబెంగాల్‌ ము ఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. శాంతినికేతన్‌ నుంచి 2004లో రవీంద్రనాథ్‌ టాగూర్‌ నోబెల్‌ మెడల్‌ చోరి అయినప్పుడు వేగిరంగా దర్యాప్తు చేసిన సిబిఐ అంటే తనకు గౌరవం ఉందని కూడా ఆమె ఈ సందర్భంగా చె ప్పారు. కాకపోతే ఇప్పుడు అదే సిబిఐ ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశాలకు లోబడి పనిచేస్తోందని ఆరోపించారు. మూడు రోజుల తన ధర్నాను విరమిస్తున్న సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడు తూ ఈ విషయాలు చెప్పారు. బిజెపి సిబిఐ ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేసిన నేత లు నేడు బిజెపిలో చేరారని, వారిపై ఉన్న కేసులను కూడా సిబిఐ కొట్టేసిందని చెప్పారు. ‘బిజెపిలో చేరితే ఇక కేసులు ఉండవు. సిబిఐ, ఇడి, ఐటి దర్యాప్తులు ఉండవు’ అని ఆమె చెప్పుకొచ్చారు. సింగూర్‌లో తపసి మలిక్‌ మర ణం, నందిగ్రాం చంపివేతల కేసులో సిబిఐ నత్తనడకన పనిచేస్తోందని కూ డా ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యవసాయ భూముల పరిరక్షణ కమిటీలో తపసి మలిక్‌ అనే టీనేజర్‌ సభ్యుడుగా ఉండేవాడు. సింగూర్‌లో అతడిని 2006లో నరికి చంపేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పశ్చిమ బెంగాల్‌కు వస్తే తమకేమి అభ్యంతరం లేదని, కానీ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ మొదట తన రాష్ట్రం సంగతులు చక్కబెట్టుకుంటే మంచిదని మమతా బెనర్జీ చెప్పారు. ‘బిజెపికి నేనంటే ఎందుకింత భయం? దేనికి? వారిలాంటి కుయుక్తులతో ననాపలేరు. నేను నడిచి లేక సైకిలెక్కి వెళతాను. అలా వీలుకాకుంటే సామాజిక మాద్యమంలో నా నిరసన గళంతో ముందుకెళతాను’ అని చెప్పుకొచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?