మోడీతో కెసిఆర్ భేటీ

ప్ర‌ధానికి 16 డిమాండ్ల మ‌హావిజ్ఞాప‌న ప‌త్రం స‌మ‌ర్పించిన సిఎం

న్యూఢిల్లీ ః రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు బుధ‌వారంనాడు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌పై కూడా ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు. మోడీకి ఆయ‌న 16 డిమాండ్ల‌తో కూడిన మ‌హావిజ్ఞాప‌న ప‌త్రంను సైతం స‌మ‌ర్పించారు. బైస‌న్‌, పోలో మైదానాల బ‌దిలీ, క‌రీంన‌గ‌ర్‌లో ఐఐఐటి, హైద‌రాబాద్‌లో ఐఐఎం, కొత్త జిల్లాల్లో 21 జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల ఏర్పాటు, హైద‌రాబాద్‌లో ఐఐఎస్ఇఆర్ ఏర్పాటు, ఆదిలాబాద్లో సిసిఐ పున‌రుద్ద‌ర‌ణ‌, జ‌హీరాబాద్‌లో నిమ్జ్ ఏర్పాటు, వ‌రంగ‌ల్‌లో కాక‌తీయ మెగా ట‌క్స‌టైల్ పార్క్ అభివృద్ధి వంటి డిమాండ్ల‌న్నీ ఈ విజ్ఞాప‌న ప‌త్రంలో వున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?