ముష్క‌రుల అంతానికి భార‌త్‌తో క‌లిసి పోరాటం

శ్రీనగర్‌ : పుల్వామా ఘ‌ట‌న‌ల‌పై భార‌త్‌కు ప్ర‌పంచ దేశాలు బాస‌ట‌గా నిలిచాయి. ఉగ్రవాదుల ఘాతుకాన్ని ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన అమెరికా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత్‌తో కలిసి పోరాడుతామని ప్రకటించింది. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్‌, జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. ఉగ్రదాడిని హేయమైన చర్యగా ఆస్ట్రేలియా అభివర్ణించింది. ఉగ్రపోరులో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్‌, శ్రీలంకలు అమరుల కుటుంబాలకు తమ సానుభూతిని ప్రకటించాయి. ఉగ్రదాడిని ఐరాస ప్రధాన కార్యదర్శి తీవ్రంగా ఖండించారు. అమరుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. జై షే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ మసూర్‌ అజార్‌పై భారత్‌ ప్రతిపాదించిన నిషేధానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?