ముగ్గురు వలస కార్మికులకు కరోనా

ఒక్కరోజే రాష్ట్రంలో 15 కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నట్టుండి పెరిగాయి. గురువారంనాడు ఒక్కరోజే 15 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ 19 కేసుల సంఖ్య 1122కి పెరిగింది. గురువారంనాడు 45 మందిని డిశ్చార్జి చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 400 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 693 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన 15 కేసుల్లో 12 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనే నమోదుకాగా, మరో మూడు కేసులు ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికులకు చెందిన వి. వలస కార్మికుల్లో 3 కేసులు గుర్తించడం ఇదే ప్రప్రథమం. ఇప్పటివరకు కరోనా కారణంగా రాష్ట్రంలో 29 మంది మరణించారు.

DO YOU LIKE THIS ARTICLE?