ముగ్గురు ఎమ్మెల్సీలు, నలుగురు మాజీ ఎంపీలు, సిట్టింగ్ మాజీ మంత్రులకు చోటు

ప్రజా పక్షం/హైదరాబాద్ : కాంగ్రెస్ తొలి జాబితా సోమవారం అర్ధర్రాతి విడుదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ప్రజాకూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ 65 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఈజాబితాను ఎఐసిసి విడుదల ఢిల్లీలో విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, నలుగురు మాజీ ఎంపీల పేర్లు వున్నాయి. ముగ్గురు ఎమ్మెల్సీలు ఆకుల లలిత (ఆర్మూర్), షబ్బీర్ ఆలీ (కామారెడ్డి), కోమటిరెడ్డి రాజగోపాల్ (మునుగోడు)లకు సీట్లు దక్కగా, నలుగురు మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), సర్వే సత్యనారాయణ (కంటోన్మెంట్), మల్లు రవి (జడెర్ల), బలరాంనాయక్ (మహబూబాబాద్)లు చోటు దక్కించుకున్నారు సిట్టింగ్ ఉత్తమ్ సతీమణి పద్మావతిరెద్దికి సీటు దక్కింది. ఆరుగురు ఎస్టీలు, 14 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు ఈ తొలి జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఇక యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ యాదవ్ (ముషీరాబాద్) కూడా సీటు సంపాదించారు. గజ్వేల్ నుంచి ఒంటేరు ప్రతాప్ పరకాల నుంచి కొండా సురేఖ పోటీ చేయబోతున్నారు. మిగతా ప్రజా కూటమి అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదలచేసే అవకాశం వుంది. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన పిసిసి అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఆర్.సి.కుంటియాలు సోమవారం ఉదయం కాంగ్రెస్ అధినేత రాహుల్ అయ్యారు. ఈ సందర్భంగా జాబితా గురించి చర్చించారు. ముఖ్యంగా అభ్యర్థుల జాబితాలో బిసిలు, ఒసిలు,ఒయు జెఎసిలో ఎంత మందికి చోటు కల్పించారని, మిగతా సామాజిక వర్గాలకు ఎలా న్యాయం చేశారనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. సామాజిక సమీకరణల నేపథ్యంలో గతంలో రూపొందించిన జాబితాను కొన్ని మార్పులు చేయాలని వారికి రాహుల్ సూచించినట్లు తెలిసింది. అనంతరం ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్, తెలంగాణ అభ్యర్థుల ఎంపిక, కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ జాబితాపై చర్చ సమయంలో ఉత్తమ్, కుంతియాతోప ఆటు ఎఐసిసి కార్యదర్శులు బోసురాజు, సలీంఅహ్మద్, శ్రీనివాసన్ కృష్ణన్ కూడా కమిటీ ఆహ్వానించింది. అనంతరం కూటమిలోని ఇతర పార్టీల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అభ్యంతరాలు లేని 70 స్థానాలలో అభ్యర్థుల పేర్లకు గ్రీన్ సిగ్నలిచ్చారు. అయితే ఫైనల్ 65 మందికి తొలిజాబితాలో చోటు దక్కింది.

  1. సిర్పూర్- పాల్వాయి హరీశ్ బాబు
  2. చెన్నూరు- వెంకటేశ్ నేత బోర్లకుంట
  3. మంచిర్యాల- కొక్కిరాల ప్రేమ సాగర్ రావు
  4. ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
  5. ఆదిలాబాద్- సుజాత గండ్రత్
  6. నిర్మల్- అల్లేటి మహేశ్వర్ రెడ్డి
  7. ముదోల్- రామారావు పటేల్ పవార్
  8. ఆర్మూర్- ఆకుల లలిత
  9. బోధన్- పి. సుదర్శన్ రెడ్డి
  10. జుక్కల్- ఎస్. గంగారం
  11. బాన్సువాడ- కాసుల బాలరాజు
  12. కామారెడ్డి- షబ్బీర్ అలీ
  13. జగిత్యాల- జీవన్ రెడ్డి
  14. రామగుండం- ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్
  15. మంథని- శ్రీధర్ బాబు దుద్దిల్ల
  16. పెద్దపల్లి- సి. విజయ రమణారావు
  17. కరీంనగర్- పొన్నం ప్రభాకర్
  18. చొప్పదండి- మేడిపల్లి సత్యం
  19. వేములవాడ- ఆది శ్రీనివాస్
  20. మానకొండూరు- ఆరేపల్లి మోహన్
  21. ఆందోల్- దామోదర రాజనర్సింహ
  22. నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
  23. జహీరాబాద్- గీతారెడ్డి
  24. సంగారెడ్డి- జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)
  25. గజ్వేల్- వంటేరు ప్రతాప్ రెడ్డి
  26. కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
  27. మహేశ్వరం- పి. సబితా ఇంద్రారెడ్డి
  28. చేవెళ్ల- కేఎస్ రత్నం
  29. పరిగి- రామ్మోహన్ రెడ్డి
  30. వికారాబాద్- గడ్డం ప్రసాద్ కుమార్
  31. తాండూరు- పైలట్ రోహిత్ రెడ్డి
  32. ముషీరాబాద్- ఎం. అనిల్ కుమార్ యాదవ్
  33. నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
  34. గోషామహాల్- ముకేశ్ గౌడ్
  35. చార్మినార్- మహ్మద్ గౌస్
  36. చాంద్రాయణగుట్ట- ఇసా బినోబాయిద్ మిస్రీ
  37. సికింద్రాబాబ్ కంటోన్మెంట్- సర్వే సత్యనారాయణ
  38. కొడంగల్ – రేవంత్ రెడ్డి
  39. జడ్చర్ల- మల్లు రవి
  40. వనపర్తి- జి. చిన్నారెడ్డి
  41. గద్వాల- డీ.కే అరుణ
  42. అలంపూర్- సంపత్ కుమార్
  43. నాగర్ కర్నూలు- నాగం జనార్ధన్ రెడ్డి
  44. అచ్చంపేట్- సీ.హెచ్ వంశీకృష్ణ
  45. కల్వకుర్తి- వంశీ చంద్‌రెడ్డి
  46. నాగార్జున సాగర్- జానారెడ్డి
  47. హుజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
  48. కోదాడ- పద్మావతి రెడ్డి
  49. సూర్యాపేట్- ఆర్. దామోదర్ రెడ్డి
  50. నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
  51. మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  52. భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి
  53. నకిరేకల్- చిరుముర్తి లింగయ్య
  54. ఆలేరు- భిక్షమయ్య గౌడ్
  55. స్టేషన్ ఘన్‌పూర్- సింగపూర్ ఇందిర
  56. పాలకుర్తి- జంగా రాఘవరెడ్డి
  57. డోర్నకల్- జాటోత్ రామచంద్రు నాయక్
  58. మహబూబాబాద్- పోరిక బలరాం నాయక్
  59. నర్సంపేట్- దొంతి మాధవ్ రెడ్డి
  60. పరకాల- కొండా సురేఖ
  61. ములుగు- డి. అనసూయ అలియాస్ సీతక్క
  62. పినపాక- రేగ కాంతారావు
  63. మధిర- మల్లు భట్టి విక్రమార్క
  64. కొత్తగూడెం – వనమా వెంకటేశ్వరరావు
  65. భద్రాచలం- పోడెం వీరయ్య

DO YOU LIKE THIS ARTICLE?