మియాపూర్‌ భూవివాదం సింగిల్‌ జడ్జి తీర్పుపైహైకోర్టు స్టే

ప్రజాపక్షం/హైదరాబాద్‌ లీగల్‌ : రంగారెడ్డి జిల్లా మియాపూర్‌ భూవివాదంపై సిం గిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిలుపుదల చేసింది. ఈమేరకు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌ హాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. భూ యాజమాన్య హక్కులు ఎవరివో తేలకుండా అధికారం ఉందని చెప్పి ఇతరులకు విక్రయించిన దస్తావేజుల్ని రద్దు చేస్తూ శేరిలింగంపల్లి తహసీల్దార్‌ తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. తహసీల్దార్‌ నిర్ణయాన్ని గతంలో సింగిల్‌ జడ్జి సమర్ధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సువిశాల్‌ పవర్‌ జెన్‌ లిమిటెడ్‌ పిఎస్‌ పార్థసారధిలు వేరువేరుగా దాఖలు చేసిన అప్పీల్‌ వ్యాజ్యాలను ధర్మాసనం విచారించి పైమధ్యంతర ఆదేశాలు జారీ చే సింది. “భూయాజమాన్య హక్కు ఎవరిదో తేలకుం డా రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం ఎమ్మార్వోకు లేదు. భూమి అన్యాక్రాంతం కారాదని ఎమ్మార్వో ఉత్తర్వులు ఇచ్చి ఉంటే సరిపోయేది. ఈ భూవివాదం తేలే వరకూ మియాపూర్‌ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలి. సింగిల్‌ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తున్నాం. ప్రభు త్వం చెబుతున్నట్లుగా ననద్‌ డీడ్స్‌ పేరుతో రూ.265 కోట్ల మేరకు స్టాంప్‌ డ్యూటీ ఎగ్గొట్టిన కేసుల విచారణకు ఈ మధ్యంతర ఆదేశాలేమీ అడ్డంకి కాబోవు. అయినా మియాపూర్‌ భూముల వివాదం సుప్రీంకోర్టులో ఉంది. అక్కడ ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో తెలియదు. సుప్రీంకోర్టులో వివాదం తేలే వరకూ ఆ భూములపై యథాతథపరిస్థితిని కొనసాగించాలి. ఎవరి ఆధీనంలో ఆ భూములు ఉన్నాయో వారి వద్ద నే భూములు ఉండవచ్చు. ఈ ఆదేశాలను కనుక పిటిషనర్లు లేదా వారి తరఫు వారు దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం తిరిగి తమ దృష్టికి తీసుకురావచ్చు… ”అని ధర్మాసనం మధ్యంతర ఆదేశాల్లో పేర్కొంది. కోట్లాది రూపాయల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను ఎమ్మార్వో రద్దు చేయడాన్ని హైకోర్టు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయవద్దని తొలుత తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోరారు. సబ్‌ రిజిష్ట్రార్లతో కొందరు చేతులు కలిపి భూదందాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ భూమి (సర్వే నెం 20,28,44, 45, 100,101)ని అమ్మేశారని, స్టాంప్‌ డ్యూటీ ఎగ్గొట్టారని, ఎమ్మార్వో రిజర్వేషన్లను రద్దు చేయడాన్ని నిలిపివేస్తే ఆ కేసుల దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?