మిగతా హామీలన్నీ ఎన్నికల తర్వాతనే..

‘పోడు’ ప్రాంతాలకు పదిహేను రోజుల్లో వస్తా
ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడే ఉన్నాం
7 నెలల్లో నిరుద్యోగ భృతి
పంచాయతీల్లో ‘గృహ’ లబ్ధిదారుల జాబితా
అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 61 సంవత్సరాలకు పెంపు, పిఆర్‌సి, నిరుద్యోగ భృతి, స్వంతంగా ఇళ్లు కట్టుకునేందుకు రూ.ఐదు లక్ష లు వంటి టిఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలపై లోక్‌సభ ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో సూచనప్రాయంగా వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ హామీలపై ప్రతిపక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దీనికి సిఎం కెసిఆర్‌ స్పం దిస్తూ నిరుద్యోగ భృతి ఏడు నెలల తరువాత అమ లు చేస్తామని, రిటైర్మెంట్‌ వయోపరిమితి పెం పుపై జూన్‌ తరువాత, ఇళ్ళు కట్టుకునేందుకు డబ్బులు ఇచ్చే అంశంపై వివిధ ఎన్నికల కోడ్‌ తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడే ఉన్నామని, వారికి సబబైందే ఇస్తామని కెసిఆర్‌ ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో 42-13 శాతం జీతాలను జీతాలు పెంచామన్నారు. ఉద్యోగులకు సదుపాయాలను కల్పంచామన్నారు. తెలంగాణ ఉద్యోమంలో కూడా ఉద్యోగులు పాల్గొన్నారని, అందుకే వారికి ఇంక్రిమెంట్‌ కూడా అందజేశామని వివరించారు. ఆర్థికపరమైన అంశా లు ఇలా అన్ని పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై జూన్‌ తర్వాత చర్చ జరగాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?