మహా కల్తీ మనకక్కర్లేదు

ప్రతిపక్షాలను ప్రజలు నమ్మరు
బిజెపితోనే దేశాభివృద్ధి
లోక్‌సభలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చారు. ఈ చర్చ బుధవారమే ఆరంభమైంది. ఈ తీర్మానం గురువారం ఆమోదంకు వచ్చింది. లోక్‌సభలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వానికే మెజారి టీ ఉంది. ప్రధాని సమాధానం ఇవ్వనున్నందున సభలో సభ్యులందరూ నేడు, రేపు హాజరు కావాలని బిజెపి విప్‌ జారీ చేసింది. లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాలు ఆరంభమైనప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జనవరి 31న ప్రసంగించారు. విపక్షాల ఐక్యతపై ప్రధాని మోదీ తనదైన శైలిలో స్పందించారు. 23 పార్టీలు ఏకమవ్వడాన్ని ‘మహా కల్తీ’గా (మహా మిలావట్‌) అభివర్ణించారు. అలాం టి సర్కారును ఎవరూ కోరుకోరన్నారు. అలాంటి సర్కారు వస్తే ఏమవుతుందో ప్రజలకు తెలుసన్నా రు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తంచేశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నామం టూ తనను విమర్శిస్తున్న పార్టీలు అదే క్రమంలో దేశాన్ని కూడా ద్వేషిస్తున్నాయంటూ మండిపడ్డా రు. రాఫెల్‌ అంశంపైనా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. వాయుసేన బలోపేతం కావడం ఇష్టంలేక ఆ పార్టీ వివాదం చేస్తోందని విమర్శించారు. ఆర్మీ చీఫ్‌ను ‘గూండా’ అని కూడా అన్నారు. కాంగ్రెస్‌లో కొందరు మోడీ, బిజెపిని విమర్శిస్తుంటే మరి కొందరు దేశంపైనే దాడి చేస్తున్నారన్నారు. ప్రతిపక్షానికి నిజాన్ని వినే ఓపిక తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు.
‘బిసి’, ‘ఎడి’అంటే…: కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ‘బిసి’ అంటే ‘బిఫోర్‌ కాంగ్రెస్‌’ అని, ‘ఎడి’ అంటే ‘ఆఫ్టర్‌ కాంగ్రెస్‌’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీని రుద్దిన కాంగ్రెస్‌ పార్టీ నేడు న్యాయవ్యవస్థను, సైన్యాన్ని అవమానిస్తోందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్నామంటూ ఆరోపిస్తున్నాయన్నారు. రాఫెల్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పదేపదే విమర్శలు చేస్తున్నారని, ఆయనకు భారత వాయుసేన బలోపేతం కావడం ఇష్టంలేదన్నారు. రాజ్యాంగం 356 ఆర్టికల్‌ను దుర్వినియోగం చేసి కాంగ్రెస్‌ నాడు అనేక రాష్ట్రప్రభుత్వాలను అనేకసార్లు కూలదోసిందన్నారు. ఇందిరా గాంధీ సయంగా రాష్ట్రప్రభుత్వాలను 50సార్లు రద్దు చేసిందని పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?