మరో 11 కేసులు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌  : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 11 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. బుధవారం నమోదైన ఈ 11 కేసులను కలుపుకొని మొత్తంగా 1107 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది. తాజాగా మరో 20 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 648కి చేరగా, ఇంకా 430 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 29 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. బుధవారం నమోదైన 11 కేసులూ జిహెచ్‌ఎంసి పరిధిలోనివే.

DO YOU LIKE THIS ARTICLE?