మరో ‘దిశ’

ప్రజాపక్షం/రంగారెడ్డి/చేవెళ్ల: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన మరవకముందే, అలాంటి మరో ఉదం తం చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన దుం డగులు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. పోలీసులు ముందుగా మృతురాలిని గుర్తించే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో గుర్తు తెలియని వివాహిత (30)పై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆ మహిళపై హత్యచారం చేసి ఆపై ముఖం గుర్తు పట్టకుండా ఉండేందుకుగాను బండరాయితో బాది హత్య చేసి శవాన్ని తంగడపల్లి గ్రామ బ్రిడ్జి కింద పడేశారు. అయితే మహిళ ఒంటిపై ఎలాంటి బట్ట లు లేకపోవడం, హత్యకు ఉపయోగించిన బండరాయి కూడా అనవాళ్లు దొరకుండా దుం డగులు హత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తంగడపల్లి గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జూమున చోటు చేసుకుంది. మహిళ హత్య ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు,స్థానికుల కథనం ప్రకారం 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వివాహిత మహిళను గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో దూరంగా హత్య చేసి అక్కడి నుంచి వాహనంలో చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి గ్రామ శివారు లో రోడ్డు వెంబడి ఉన్న బ్రిడ్జి కింద పడేశారు. మహిళలను హత్య చేసి తీసుకువచ్చే సందర్భంలో నడుముకు తాడు కట్టి దాని సహాయంతో బ్రిడ్జి కింద కు శవాన్ని దించినట్లు అక్కడ ఆధారాలు లభించినట్లు తెలిపారు. అనంత రం ఆ మహిళ ఒంటిపై ఎలాంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా పడవేశారు. మహిళ ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు బండరాయితో బల ంగా బాదడంతో మెదడుతో పాటు, రక్తం పడివుంది. ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఉ.7గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు బహిర్భూమికి వెళ్లాడు.అక్కడ కొద్ది దూరంలో ఉన్న బ్రిడ్జి కింద బొమ్మ లా కన్పించడంతో దగ్గరకు వెళ్లి చూడగా మహిళ ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా చనిపోయి ఉండడాన్ని చూసి వెంటనే ఆ యువకుడు గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్థులు వచ్చి చూసి చేవెళ్ల పోలీసులకు సమాచారం ఆందించారు. ఘటన స్థలానికి చేవెళ్ల సిఐ బాల కృష్ణ, ఎస్‌ఐ రేణుకారెడ్డిలు సిబ్బందితో చేరుకుని బ్రిడ్జి కింద ఉన్న మహిళ మృతదేహన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు గుర్తు తెలియని మహిళ హత్య కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?