మంధనాసేనకు మరో ఓటమి..

రాణించిన వ్యాట్‌
సిరీస్‌ 2-0తో ఇంగ్లాండ్‌ వశం
గువాహటి: ఇంగ్లాండ్‌ మహిళలతో జరిగిన రెండో టీ20లోనూ మంధనా సేన ఓటమి చవిచూసింది. ఫలితంగా మూడు మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌ అమ్మాయిలు 2 కైవసం చేసుకున్నారు. వన్డేల్లో జోరు కనబర్చిన భారత అమ్మాయిలు టి20ల్లో మాత్రం మరోసారి తేలిపోయారు. గురువారం జరిగిన కీలకమైన రెండో టి20లో టీమిండియా 5 వికెట్లతో ఓడింది. భారత్‌ నిర్దేశించిన 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇం గ్లా ండ్‌ మరో ఐదు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు నష్టపోయి ఛే దించింది. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ డానియెల్‌ వ్యాట్‌ (64; 55 బం తుల్లో 6 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో చెలరేగి విజయంలో కీలక పాత్ర పోషించింది. వన్డేల్లో జోరును కనబరుస్తున్న టీమిండియా పొట్టి క్రికెట్‌లో మాత్రం ఆడలేక పోతున్నారు. ముఖ్యంగా భారత బ్యాట్స్‌ఉమెన్స్‌ పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టి20ల్లోనూ భారత బ్యాటర్లు తేలిపోయారు. ఏ ఒక్కరు కూడా కనీసం ముప్పు పరుగుల మార్కు ను కూడా అందుకోలేక పోయారు. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ (20) పరుగులే టాప్‌ స్కోరర్‌గా నిలిచిం ది. మిగతా బ్యాట్స్‌ఉమెన్స్‌ 20 పరుగుల మార్కును సైతం దాటలేక పోయారు. దీంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులే చేయగలిగింది. ఇక తక్కువ స్కోరును కాపాడుకునేందుకు భారత బౌలర్లు చివరి వరకు పోరాడినా ఫలితంలేకుండా పోయింది. మంధనా సారథ్యంలో భారత్‌ వరుసగా రెండో ఓటమి ని చవిచూసింది. టీమిండియా రెగ్యులర్‌ సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గాయంతో సిరీస్‌కు దూరం కావడంతో ఓపెనర్‌ స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. మొదటిసారి సారథ్యం వహిస్తున్న భార త స్టార్‌ బ్యాటర్‌ మంధనాకి చేదు అనుభవమే మిగిలింది. గురువా రం జరిగిన రెండో టి20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్‌ స్మృతి మంధనా దూకుడైన ఆరంభాన్ని ఇచ్చినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయింది. కెప్టెన్‌ మంధనా 5 బంతుల్లోనే 2 సిక్సర్లతో 12 పరగులు చేసి బ్రంట్‌ బౌలింగ్‌లో వెనుదిరిగింది. దీ ంతో భారత్‌ 24 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత పుంజుకున్న ఇంగ్లాండ్‌ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ టీ మిండియాను హడలెత్తించారు. దీంతో జెమీమా రోడ్రిగ్స్‌ (2), హర్లీన్‌ డియోల్‌ (14; 21 బంతుల్లో 2 ఫోర్లు) వెనువెంటనే వికెట్లు చేజార్చుకోవడంతో భారత్‌ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పో యి కష్టాల్లో పడింది. అనంతరం మిథాలీ రాజ్‌ (20; 27 బంతుల్లో 1 ఫోర్‌), దీప్తి శర్మ (18), భారతి ఫులాలి (18) పరుగులు చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. మిగతా వారు ఒక్క డిజిట్‌ మార్కును కూడా దాటలేక పోవడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులే చేయగలిగింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో కేథరిన్‌ బ్రంట్‌ (3/17), లిన్సె స్మిత్‌ (2/11) విజృంభించి బౌలింగ్‌ చేశారు. దీంతో టీమిండియా తక్కువ స్కోరుకే కట్టడి అయింది. ఇ క స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇగ్లాండ్‌కు కూడా భారత బౌలర్లు చుక్కలు చూపెట్టారు. సాధారణ లక్ష్యమే అయినా దానిని కాపాడుకోవాడానికి మన బౌలర్లు ఆఖరి కంఠం వరకు పోరాడా రు. వీరి ధాటికి టామీ బియోమంట్‌ (8), అమీ ఎలెన్‌ (5), నటాలీ స్కీవర్‌ (1), కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (2)ను స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. దీంతో మ్యాచ్‌ ఉత్కంఠకరంగా సాగింది. ఒక వైపు వికెట్లు పడుతున్న మరోవైపు ఓపెనర్‌ డానియెల్‌ వ్యాట్‌ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ ఇంగ్లాండ్‌ను అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకుంది. లారెన్‌ విన్‌ఫీల్డ్‌ (29; 23 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి చెలరేగి ఆడింది. చివరి వరకు అజేయంగా ఉండి ఇంగ్లాండ్‌ను మరో 5 బ ంతులు మిగిలుండగానే విజయాన్ని అందించింది. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన వ్యాట్‌ 64 పరుగులతో అజేయంగా నిలిచింది.

DO YOU LIKE THIS ARTICLE?