భారత్‌కు మూడో స్వర్ణం

న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ పోటీల్లో భారత్‌ మూడో స్వర్ణం సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ చౌదరి బాకర్‌ జోడీ స్వర్ణం గెలుచుకుంది. మూడు రోజులుగా పతకం కోసం ఎదురు చూస్తున్న భారత్‌కు సౌరభ్‌ జంట ఊరట కలిగించింది. మిక్స్‌డ్‌ ఈవెంట్‌ ఫైనల్లో భారత జోడీ 483.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం కైవసం చేసుకుంది. భారత జంట రెండో స్థానంలో నిలిచిన చైనా జోడీ రాన్‌జిన్‌ జియాంగ్‌, బోవెస్‌ సంగ్‌ జంటపై 5.8 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించడం విశేషం. చైనా జంట 477.7 పాయింట్లతో రజతం సొంతం చేసుకుంది. కొరియాకు చెందిన కిమ్‌ జంట కాంస్యం సాధించింది. కాగా, స్వర్ణం కోసం జరిగిన పోరులో మను జోడీ అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. కాగా, రవికుమార్‌ అపూర్వి చండేలా కుమార్‌ జంట పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాయి. కాగా, భారత్‌ ఈ ప్రపంచకప్‌లో మూడు స్వర్ణాలతో హంగేరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మళ్లీ గురి తప్పారు..
భారత స్టార్‌ షూటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఒత్తిడికి లోనై గురి తప్పారు. ఫలితంగా అంతర్జాతీయ షూటి ంగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రప ంచ కప్‌ టోర్నమెంట్‌లో నాలుగో రోజు భా రత్‌ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలే దు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మను భాకర్‌, అనురాధ, హీనా సిద్ధూ, వరుసగా 14వ, 22వ, 25వ స్థానాల్లో నిలువగా.. 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో గాయత్రి 36వ స్థానంలో, సునిధి చౌహాన్‌ 49వ స్థానంలో నిలిచారు.
పురుషుల విభాగంలో..
పురుషుల విభాగంలో 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో ఆదర్శ్‌ సింగ్‌, అర్పి త్‌ గోయల్‌ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిర గ్గా… 16 ఏళ్ల అనీశ్‌ భన్వాలా ఫైనల్‌కు చే రినా పతకం నెగ్గలేదు. కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత అనీశ్‌ భన్వాలా 14 పా యింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఒలింపిక్‌ చాంప్‌ క్రిస్టియన్‌ రీట్జ్‌ (జర్మనీ పాయిం ట్లు) స్వ ర్ణం… ప్రపంచ చాంపియన్‌ జున్‌మిన్‌ లిన్‌ (చైనా రజతం… కిమ్‌ జున్‌హోంగ్‌ (కొరియా కాంస్యం నెగ్గారు.

DO YOU LIKE THIS ARTICLE?