బ్రేక్‌ డౌన్‌!

ఆర్‌టిఎ కార్యాలయాల్లో ‘సర్వర్‌ కష్టాలు’
తరచూ మొరాయిస్తున్న రవాణ శాఖ మెయిన్‌ సర్వర్‌
ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయంతో కార్యాలయాల్లో ప్రజల పడిగాపులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ సర్వీసులు అందించడంలో దేశంలోనే పేరుగాంచిన తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖను ఇప్పుడు కంప్యూటర్‌ సర్వర్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. మరోవైపు తరచూ సర్వర్‌ మొరాయించడంతో ఆర్‌టిఎ కార్యాలయాలకు వచ్చే వాహనదారులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని వివిధ సర్వీసుల కోసం కార్యాలయాలకు వస్తున్న వాహనదారు లు, ప్రజలు ఉదయం నుంచి దాదాపు మధ్యా హ్నం వరకు, ఒక్కోసారి కార్యాలయం పనివేళ లు ముగిసేవరకు అక్కడే పడిగాపులు పడాల్సి వస్తుంది. సర్వర్‌ ఎప్పుడు కనెక్ట్‌ అవుతుందా అని దేవుడికి దీపం పెట్టి వేడుకున్నట్లు ప్రజలు అక్కడే ఎదురుచూసే పరిస్థితి వస్తోంది. సర్వర్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో ఒక పని కోసం వచ్చిన వాహనదారుడు రెండు మూడు రోజులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ప్రజలకు అన్నీ ఆన్‌లైన్‌ సర్వీసులను అలవాటు చేసిన రవాణా శాఖ ఇప్పుడు వారికి అష్టకష్టాలకు గురిచేస్తున్నది. రవాణ శాఖ దాదాపు అన్ని సర్వీసులను ఆన్‌లైన్‌లో అందించడంతో వాహనదారులు, ప్రజ ల్లో వాటిపై చైతన్యం పెరిగి ఆన్‌లైన్‌లో సేవలు పొం దే వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతున్నది. కార్యాలయాలకు వస్తున్న ప్రజల సంఖ్య కు అనుగునంగా రవాణా శాఖ సాంకేతిక పరమైన ఏర్పాటు చేయకపోవడం,ఇంకా గత 15 ఏళ్ల కింద టి మెయిన్‌ సర్వర్‌ తదితర కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తుండడం ఇం దుకు ప్రధాన కారణమని, వాహనదారులు, పలువురు అధికారులు చెబుతున్నారు. 2000 సంవత్సరంలో రవాణ శాఖలో టూటైర్‌ విధానంలో నాలుగైదు సేవలను అందిసంచిన సర్వర్‌ ద్వారానే 2016 నుంచి త్రి టైర్‌ విధానం ద్వారా మొత్తం 56 సర్వీసులను ఆన్‌లైన్‌లో అందిస్తుండడం ందు కు నిదర్శనం. అప్పట్లో రోజుకు ఒక్క ఆర్‌టిఎ కార్యాలయంలో లర్నింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌, ఎన్‌ఓసి, ఫిట్‌నెస్‌ తదితర రకాల సేవల కో సం మొత్తం 150కార్యకలాపాలు జరిగేవి. ప్రస్తు తం 56 రకాల సేవలతో రోజు సుమారు 500 నుంచి 800 కార్యకలాపాలు జరుగుతుండడం గమనార్హం. అయినా అప్పటి సాంకేతిక పరిజ్ఞానం తో రవాణ శాఖ కాలాన్ని నెట్టుకొస్తున్నది. ఫలితంగా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గత 15 రోజుల్లోనే మూడు నాలుగు సార్లు సర్వర్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో రాష్ట్రంలోని 74 ఆర్‌టిఎ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ సర్వీసలకు ఆట ంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో అధికారులు, ఉద్యోగులు కూడా సర్వర్‌ కనెక్ట్‌ అయినప్పుడు పనులు చేస్తూ, లేనప్పుడు తాపీగా కూర్చోవడం తప్ప చేసేదేమీ ఉండడం లేదు. రవాణ శాఖ కేంద్ర కార్యాలయంలో ఉన్న మెయిన్‌ సర్వర్‌ స్థానంలో రెట్టింపు స్థాయి సామర్థ్యం కలిగిన సర్వర్‌ ఏర్పా టు చేస్తే తప్ప ప్రజలకు ఆన్‌లైన్‌ కష్టాలు తప్పవని స్వయంగా ఆర్‌టిఎ కార్యాలయాల అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న సర్వర్‌ స్థానం లో మరోక కొత్త సర్వర్‌ను ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.1.5 కోట్లు అవసరమౌతాయని, అంత డబ్బును ప్రబుత్వం విడుదల చేసే పరిస్థితి కనుచూపుమేరలో కనబడడం లేదని వారంటున్నారు. దీంతో ఉన్నదాన్నే మమమ్మతులు చేయ డం, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేకుంటూ కార్యాలయాలను కొనసాగిస్తున్నామని వారు చెబుతున్నారు. వాహనదారులకు అందిస్తున్న సేవల ద్వా రా రవాణ శాఖకు ఏటా దాదాపు 3500 కోట్ల ఆదాయం వస్తున్నది. ఈడబ్బును ప్రజలకు మెరుగైన సేవలం అందించేందుకు కాకుండా దేనికి వినియోగిస్తున్నారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకుని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఙప్తి చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?