బ్రెడ్‌, బ‌న్‌లు ల‌భించ‌క‌…?

బ్రెడ్‌, బ‌న్‌లు ల‌భించ‌క‌…న‌గ‌ర వాసుల ఇబ్బందులు

ప్ర‌జాప‌క్షం/హైద‌రాబాద్ : లేచిన వెంట‌నే చాయ్ లేదా పాల‌తో పాటు బ్రెడ్‌, బ‌న్ తిన‌డంతో హైద‌రాబాద్ న‌గ‌ర వాసులు త‌మ దిన చ‌ర్య ప్రారంభిస్తారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌భుత్వం లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న విష‌యం తెల్సిందే. దీంతో న‌గ‌రంలో బ్రెడ్, బ‌న్‌లు త‌యారు చేసే కంపెనీల‌తో పాటు బేక‌రిలు మూత‌ప‌డ్డాయి. కేవ‌లం కిర‌ణా, కుర‌గాయాలు, పాల దుకాణాల మాత్ర‌మే అనుమితించింది. బ్రెడ్‌, బ‌న్‌లు ల‌భించక న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ప్ర‌తిరోజు ఉద‌యం లేచిన వెంట‌నే అల్ఫ‌హారంగా బ్రెడ్‌, బ‌న్‌లు తీసుకుంటారు. గడ‌చిన కొన్ని రోజులుగా బేక‌రిలు బంద్ చేయ‌డంతో బ్రెడ్‌, బ‌న్‌లు దొర‌కడం లేదు. పాత‌బస్తీ, కోర్ సిటీలో వీటిని ఎక్కువ‌గా తీసుకుంటారు. క‌నీసం బ్రెడ్‌, బ‌న్‌లు ల‌భించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న‌గ‌ర వాసులు కొరుతున్నారు. ఉద‌యం, సాయంత్రం వెళాల్లో ప‌రిమిత స‌మ‌యం వ‌ర‌కైన బ్రెడ్‌, బ‌న్‌లు విక్ర‌యించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కొరుతున్నారు. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి వారు ఎక్కువ మంది త‌క్కువ వ్య‌యం అవుతున్నందున బ్రెడ్‌, బ‌న్‌ల‌తో త‌మ ఆక‌లిని తిర్చుకుంటున్నారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు అన్న‌పూర్ణ‌గా మారిన బ్రెడ్‌, బ‌న్‌ల‌ను విరివిరిగా లభించే విధంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. బ్రెడ్‌, బ‌న్‌లు త‌యారు చేసే బేక‌రిల‌లో కార్మికులు గ‌త కొన్ని రోజులుగా ప‌ని లేక‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నారు. క‌నీసం బ్రెడ్‌, బ‌న్‌ల త‌యారికీ అనుమ‌తి ఇవ్వ‌డంతో త‌క్కువ ధ‌ర‌కు పేద‌ల ఆక‌లి తీర్చిడంతో పాటు పేద కార్మికుల‌కు ఉపాధి క‌ల్పించిన‌ట్లు అవుతుంద‌ని ప‌లువురు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?