బుల్లితెర నటి ఆత్మహత్య

అవకాశాలు తగ్గడం, ప్రేమ విఫలమే కారణమా?

ప్రజాపక్షం/సిటీబ్యూరో/ పంజాగుట్ట/చిలకలగూడ : బుల్లితెర వర్ధమాన నటి ఝాన్సీ(21) హైద రాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీ నాగార్జుననగర్‌లో తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ఝా న్సీ డిప్రెషన్‌లో ఉన్నట్లు బంధువులు చె బుతున్నారు. టివిలో అవకాశాలు తగ్గడం, ప్రేమ వ్యవహారంలో విభేదాలు తలెత్తడంతో ఝా న్సీ ఒత్తిడికి లోనైట్లు స్నేహితులు చెబుతున్నా రు. ఆత్మహత్యకు ముందు ఝాన్సీ ప్రియు డు సూర్యతో చాటింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో ఝాన్సీ ఫోన్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం… కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ(21) పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగార్జుననగర్‌ సాయిరాం రెసిడెన్సీ లో నివాసం ఉంటోంది. స్థానికంగా ఆమె బ్యూటీ పార్లర్‌ కూడా నిర్వహిస్తోంది. కొంత కాలం క్రితం మాటివిలోని ‘పవిత్రబంధం’ సీరియల్‌లో నటించింది. అదే సమయంలో విజయవాడకు చెందిన సూర్యతో ప్రేమలో పడింది. సూర్య కూడా ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లి అన్నపూర్ణకు చెప్పినట్లు సమాచారం. ఝాన్సీ కెరియర్‌ తొలినాళ్లలో అవకాశాలు బాగానే వచ్చినా రానురాను తగ్గిపోయాయి. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లింది. ప్రియుడు సూర్యతో కూడా ఇటీవల విభేదాలు తలెత్తినట్లు సన్నిహితులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం సోదరుడు దుర్గా ప్రసాద్‌ ఝాన్సీ ఇంటికి వచ్చాడు. ఎంతకీ తలుపులు తెరవక పోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టాడు. అప్పటికే ఝాన్సీ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిందని గుర్తించారు. సోదరుడు దుర్గాప్రసాద్‌ ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సంఘటనా స్థలంలోని ఝాన్సీ ఫోన్‌ను డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఝాన్సీ చివరగా సూర్యతో చాటింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే కారణం అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు సూర్య వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఝాన్సీ తల్లి అన్నపూర్ణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూర్యపై చర్యలు తీసుకోవాలని అన్నపూర్ణ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌కు విజ్ఞప్తి చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?