బికనీర్‌లో పాకిస్థాన్‌ డ్రోన్‌ కూల్చివేత

న్యూఢిల్లీ: భారత్‌ సరిహద్దులో పా కిస్థానీ మిలటరీ డ్రోన్‌ను సోమవారం భారత వాయుసేనకు చెందిన సుకోయ్‌- 30 యుద్ధ విమానం కూల్చేసింది. ఎయిర్‌- టు- ఎయిర్‌ మిస్సైల్‌ ద్వారా దానికి కూల్చేసినట్లు ప్రభు త్వ వర్గాలు తెలిపాయి. భారత గగనతల నిబంధనలను ఉల్లంఘిస్తూ పాక్‌ ఈ చర్యకు పాల్పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. భూతలంపై ఉన్న రాడార్‌ స్టేషన్‌ పాకిస్థానీ డ్రోన్‌ను గుర్తించిన వెంటనే నిమిషాలలో సుకోయ్‌-30 జెట్‌ యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. భారతీయ గగనతలంలో నిఘా పెట్టి మరీ దానిని కూల్చేసిన ట్లు వారు చెప్పారు. రాజస్థాన్‌లోని బికనీర్‌-నాల్‌ సెక్టార్‌లో ఉదయం 11.30 గంటలకు పాకిస్థానీ మిలటరీ డ్రోన్‌ను కూల్చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 27న కూడా గుజరాత్‌లోని కచ్‌లో భారత-పాకిస్థాన్‌ సరిహద్దులో ఓ గూఢచార డ్రోన్‌ని కూడా కూల్చేశారు. ఆరు రోజులో గూఢచార డ్రోన్‌ను భారత్‌లోకి పంపాలని పాకిస్థాన్‌ విఫలయత్నం చేయడం ఇది రెండోసారి. పశ్చిమ సెక్టార్‌లోని తన అన్ని స్థావరాల్లో భారత్‌ అప్రమత్తంగా ఉంది. కశ్మీర్‌లోని మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు జరపాలనిపాకిస్థాన్‌ఫిబ్రవరి27నుంచివిఫలయత్నం చేస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?