బజరంగ్‌కు స్వర్ణం

సిల్వర్‌తో సరిపెట్టుకున్న ఫొగాట్‌
ఢిల్లీ: యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నీలో భారత స్టార్‌ రె జ్లర్లు బజరంగ్‌ పూనియ స్వర్ణం పతకం సాధిస్తే.. మహిళా విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ రజతం గెలుచుకుంది. బల్గెరియాలో ఆదివారం జరిగిన పురుషుల విభాగం (65 కేజీల) ఫ్రీ స్టయిల్‌ ఫైనల్లో భారత స్టార్‌ బజరంగ్‌ 12 తేడాతో యూఎస్‌ఎకి చెందిన జోర్డన్‌ ఒలివర్‌ను చి త్తు చేసి పసిడి కైవసం చేసుకున్నాడు. బజరంగ్‌ పట్టుకు ప్ర త్యర్థి విలవిలలాడాడు. ఈ మ్యాచ్‌ను బజరంగ్‌ ఏకపక్షంగా సొంతం చేసుకున్నాడు. ఇది బజరంగ్‌కు 10వ అంతర్జాతీయ మెడల్‌ కావడం విశే ష ం. ఇక మహిళల (53 కేజీ)ల విభాగం ఫైనల్లో భారత స్టార్‌ ఏషియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ వినీశ్‌ ఫొగాట్‌ 2 తేడాతో చైనాకు చెందిన కియాన్యు పాంగ్‌ చేతిలో ఓటమిపాలై ర జతంతో సరిపెట్టుకుంది. ఇక శనివారం జరిగిన పోటీల్లో భారత్‌కు చెందిన పూజ దండ (59 కే జీలు) విభాగంలో స్వర్ణం, సాక్షి మలిక్‌ (65 కేజీల) విభాగంలో రజ తం, సందీప్‌ తోమర్‌ (61 కేజీలు) రజత పతకాలు గెలుచుకున్నారు.
అభినందన్‌కు అంకితం..
ఇక పురుషుల విభాగంలో స్వర్ణం గెలుచుకున్న బజరంగ్‌ పూనియా తన పసిడిని వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమన్‌కు అంకితం చేస్తున్నట్టు… ఈ విషయాన్ని బజరంగ్‌ ట్విటర్‌లో పోస్టు చేశాడు.

DO YOU LIKE THIS ARTICLE?