ఫోన్ల ట్యాపింగ్‌

మల్లు భట్టి విక్రమార్క ఆరోపణ
ఇది ఆందోళనకరం…
భద్రతా సమస్యకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తెరలేపాయి
ఫోన్‌ ట్యాప్‌ వ్యవహారంపై ప్రధాని, హోంమంత్రి జాతికి సమాధానం చెప్పాలి
ప్రజాపక్షం / హైదరాబాద్‌ కేంద్రప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కూడా రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న వ్యక్తుల ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారుల ఫోన్‌ ట్యా పింగ్‌ చాలా ఆందోళనకరమైన విషయమని, ఇది భద్రతా సమస్యకు తెరలేపిందని అన్నా రు. ఫోన్‌ ట్యాప్‌ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశా రు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంగళవారం భట్టి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెగాసెస్‌ అనే స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా 2019 సాధారణ ఎన్నికల ముందు నుండి చాలామంది రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ అయినట్లు సిటిజన్స్‌ ల్యాబ్‌ మంత్‌ స్కూల్‌ ఆఫ్‌ యూనివర్సిటీ టొరొంటో డీటైల్డ్‌ రిపోర్ట్‌ ను ఇచ్చిందన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను తాము ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని తయారీ సంస్థ ఎన్‌.ఎస్‌.ఓ చెబుతోందని, అలాగే దీనిని ప్రయివేటు వ్యక్తులకు అమ్మలేదని స్పష్టం చేసిందన్నారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ ఫోన్‌ కూడా ట్యాప్‌ చేయడంతో పాటు, ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్లను ట్యాప్‌ చేశారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా గుర్తించిన ప్రతిపక్ష పార్టీల మనుగడకు సంబంధించి, వాటి భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగితే, అది ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలకు ప్రమాదం కలిగించినట్లేనన్నారు. పెగాసెస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌పై ప్రధాని మోడీ మౌనం వీడి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలన్నారు. ఫోన్‌ల ట్యాపింగ్‌తో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ట్యాపింగ్‌ చేసే విధానానికి రాష్ర్ట ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు.
దళితబంధు హుజూరాబాదేకే పరిమితం చేయొద్దు
దళిత బంధు పథకాన్ని కేవలం హుజూరాబాద్‌ మాత్రమే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. కేవలం హుజూరాబాద్‌లోనే అమలు చేసినట్లయితే ఉప ఎన్నిక కోసమే పథకాన్ని తీసుకువచ్చినట్లు చూడాల్సి వస్తుందన్నారు.
22న చలో రాజ్‌భవన్‌ : దామోదర్‌, ఆలేటి
రాహుల్‌గాంధీ, జర్నలిస్టుల ఫోన్‌ ట్యాంపింగ్‌కు నిరసిస్తూ ఈ నెల 22న ఇందిరాపార్క్‌ నుండి చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిపిసిసి ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహా, ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఆలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో మంగళవారం వారిరువురు మీడియాతో మాట్లాడుతూ ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా “ఛలో రాజ్‌ భవన్‌” కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?