ఫైనల్లో.. సింధు X సైనా

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌
గువహాటి: భారత స్టార్‌ షట్లర్లు పివి సిం ధు, సైనా నెహ్వాల్‌ జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైన్లలో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి సెమీఫైనల్లో ఒలింపిక్‌ సిల్వర్‌ మె డలిస్ట్‌ సింధు 21 22 తేడాతో అస్సాం యువ క్రీడాకారిణీ అశ్మిత చాహిలాపై చెమటోడ్చి నెగ్గింది. తొలి గేమ్‌ను ఈజీగా గెలుచుకున్న సింధుకు రెండో గే మ్‌లో ఈ యువ క్రీడాకారిణీ చుక్కలు చూ పెట్టింది. చివర్లో తన అనుభవంతో సింధు గేమ్‌ పాయింట్లో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనా నెహ్వాల్‌ 21 21 వైష్ణవి భాలే (నాగ్‌పూర్‌)ను ఓడించి ఫైనల్లో దూసుకెళ్లింది. శనివారం జరిగే మహిళల ఫైనల్స్‌లో సైనా, సింధు అమీతుమీ తేల్చుకోనున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?