ఫైనల్లో ప్రజ్నేశ్‌

న్యూఢిల్లీ: చైనాలో జరుగుతున్న కున్‌మింగ్‌ ఓపెన్‌ ఎటిపి ఛాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నెంబర్‌వన్‌ ప్రజేశ్‌ గుణేశ్వరన్‌ ఫైనల్లో దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, రెండో సీడ్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ (భారత్‌) 7 (5), 6 6 తేడాతో పొలాండ్‌కు చెందిన మూడో సీడ్‌ కామిల్‌ మజ్‌చ్రజాక్‌పై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి జోరును ప్రదర్శించిన ప్రజ్శేశ్‌కు ప్రత్యర్థి నుంచి కూడా గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ తొలి సెట్‌ నుంచే హోరాహోరీగా తలపడ్డారు. చెరో పాయింట్‌ చేస్తూ పోవడంతో ఆఖరికి ఈ సెట్‌ టై బ్రేకర్‌కు దారి తీసింది. అయితే టై బ్రేకర్‌లో జోరును పెంచిన ప్రజ్నేశ్‌ తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. తర్వాత జరిగిన రెండో సెట్‌లోను ఇద్దరూ మరోసారి ఉత్కంఠంగా తలపడ్డారు. నువ్వా..నేనా.. అన్నట్టు సాగిన ఈ సెట్‌ కూడా చివరికి టై బ్రేకర్‌ వరకు వెళ్లింది. కానీ ఈసారి పొలాండ్‌ ఆటగాడు అధిక్యంలో దూసుకెళ్లి విజయం సాధించాడు. దాంతో ఇద్దరూ చెరో సెట్‌ గెలవడంతో ఆఖరిదైన మూడో సెట్‌ ఇద్దరికి కీలకంగా మారింది. నిర్ణయాత్మకమైన ఈ మూడో సెట్‌లో ప్రజ్నేశ్‌ తెలివిగా ఆడుతూ ముందు నుంచే ప్రత్యర్థిపై ఆధిక్యం సాదిస్తూ పోయాడు. ఆఖరికి 6 ఈ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకొని ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో భారత స్టార్‌ ప్రజ్నేశ్‌.. యుకెకు చెందిన 14వ సీడ్‌ జయ్‌ క్లార్క్‌తో తలపడనున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?