ఫైనల్లో ప్రజ్ఞేశ్‌కు చుక్కెదురు

న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలిసారి ఎటిపి ఛాలెంజర్‌ టోర్నీ ఫైనల్‌కు చేరిన భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రజ్ఞేశ్‌ గుణేశ్వరన్‌కు నిరాశే మిగిలింది. చైనా వేదికగా జరిగిన కున్‌మింగ్‌ ఓపెన్‌లో ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ ప్రజ్ఞేశ్‌కు తుది పోరులో బ్రిటన్‌ ఆటగాడు క్లార్క్‌ షాకిచ్చాడు. ఆదివారం ఇక్కడ జరిగిన టైటిల్‌ పోరులో భారత స్టార్‌, రెండో సీడ్‌ ప్రజ్ఞేశ్‌ 6 6 తేడాతో 14వ సీడ్‌ జె క్లార్క్‌ (బ్రిటన్‌) చేతిలో వరుస సెట్‌లలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. తొలి సెట్‌లో కొద్దిగా పోరాడినా ప్రజ్ఞేశ్‌ రెండో సెట్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ప్రత్యర్థి దాడులను అడ్డుకోలేక చేతులెత్తేశాడు. దాంతో దూకుడు ప్రదర్శించిన బ్రిటన్‌ ప్లేయర్‌ 34 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి విజేతగా నిలిచాడు. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలో దిగిన ఈ చెన్నై ఆటగాడు ఆఖరికి రెండో స్థానంతో సంతృప్తి పడ్డాడు. ఈ ఏడాది తొలిసారి ఎటిపి టోర్నీ ఫైనల్‌కు చేరిన ప్రపంచ 80వ ర్యాంకర్‌ ప్రజ్ఞేశ్‌కు నిరాశే మిగిలింది. అంతకుముందు రెండు టోర్నీల్లో సెమీఫైనల్స్‌లో చేరగా.. మరో టోర్నీలో రెండో రౌండ్‌లోనే ప్రజ్ఞేశ్‌ ఓడాడు.

DO YOU LIKE THIS ARTICLE?