ఫించ్‌కు అండగా కోచ్‌ లాంగర్‌

హైదరాబాద్‌: గత కొంత కాలంగా పేలవ ఆటను ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌కు ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అండగా నిలిచాడు. ఫించ్‌ ఫామ్‌లో లేకపోవడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలో మాట్లాడిన ఆసీస్‌ కోచ్‌ లాంగర్‌.. అరోన్‌ ఫించ్‌ త్వరలోనే తిరిగి గాడిలో పడతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అతనొక విధ్వంసకర ఆటగాడనే సంగతి అందరికి తెలుసు. ప్రస్తుతం అతను ఫామ్‌ లేడు. కానీ అతను జట్టులో ఎంతో విలువైన ఆటగాడు. ప్రస్తుతం ఫామ్‌లోని ఫించ్‌ త్వరలోనే తిరిగి తన ఫామ్‌ను సాధిస్తాడని ఆయన అన్నాడు. ఫించ్‌ ప్రత్యర్థి జట్లకు ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌.. ఒకసారి రాణించడం మొదలు పెడితే అతన్ని ఆపడం ఎవరితరం కాదని అందరికి తెలుసు. ఆసీస్‌కు తన హిట్టింగ్‌తో ఎన్నో గొప్ప విజయాలు అందించిన విషయం తెలిసిందే. ఇక నాయకుడిగా కూడా ఫించ్‌ ఆకట్టుకుంటున్నాడు. జట్టులో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ముందుకు తీసుకెళుతున్నాడు. ఫించ్‌ది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం’ అని లాంగర్‌ కొనియాడాడు. అందరితో కలిసి మెలిసి ఉంటాడని చెప్పాడు. ఇక రెండో టి20లో విధ్వంసకర శతకంతో ఆసీస్‌ సిరీస్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్‌వెల్‌ఫై కూడా కోచ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాక్సీ ఫామ్‌లో రావడం తమకు కలిసొచ్చే అంశమని, ఏ బౌలర్‌నైన ఈజీగా బాదగల సత్త మ్యాక్స్‌వెల్‌కి సొంతమని లాంగర్‌ అన్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?