ప‌ట్టుబిగించిన భార‌త్‌!

పుజారా సెంచ‌రీ – కోహ్లీ, రోహిత్ అర్థ‌సెంచ‌రీలు

మెల్‌బోర్న్ ం ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో క్రికెట్ టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టు బిగించిన‌ట్లు క‌న్పిస్తోంది. రెండో రోజు గురువారంనాడు భార‌త్ త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల న‌ష్టానికి 443 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేయ‌గా, ఆ త‌ర్వాత ఆట ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే స‌మ‌యానికి త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో వికెట్టు న‌ష్ట‌పోకుండా ప‌రుగులు చేసింది. హారిస్ (5), ఫించ్ (3)లు బ్యాటింగ్ చేస్తున్నారు. భార‌త బ్యాట్స్‌మ‌న్ల‌లో ఛ‌టేశ్వ‌ర పుజారా సెంచ‌రీ (106) చేయ‌గా, కోహ్లీ (82), రోహిత్ శ‌ర్మ (63)లు అర్థ‌సెంచ‌రీలు సాధించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో పాట్ క‌మిన్స్ 3 వికెట్లు, మిఛెల్ స్టార్క్ 2 వికెట్లు తీసుకున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?