ప్ర‌ధాని నిధికి విరాళాల కోసం విజ్ఞ‌ప్తి

ప్రధాన మంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధి (PM CARES Fund) కు ఉదారంగా విరాళాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి

కోవిడ్ -19 మహమ్మారి కరాళ నృత్యానికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం మరియు ఆర్థిక భద్రత తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటోంది.

భారతదేశంలో సైతం కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన కరంగా ఉంది. మన దేశ ఆరోగ్య, ఆర్థిక స్థితిగతులు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నాయి.

ఈ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వానికి మద్ధతుగా ఉదారంగా విరాళాలు ఇవ్వవలసిందిగా ప్రధానమంత్రి కార్యాలయం ఆకస్మిక మరియు అసంఖ్యాక అభ్యర్థనలను స్వీకరిస్తోంది.

సహజమైనవి లేదా ఇతరత్రా బాధాకర పరిస్థితుల్లో బాధితులకు సహకారం అందించడానికి మరియు వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం వారి సామర్థ్యాలకు నష్టాన్ని తగ్గించడం కోసం వేగవంతమైన సమిష్టి చర్యలు అవసరం అవుతాయి.

అందుకే అత్యవసర పరిస్థితుల్లో శీఘ్రమైన ప్రతిస్పందన మరియు సమర్థవంతమైన సమాజ స్థితిస్థాపకత కోసం సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు మౌలిక సదుపాయులు మరియు సంస్థాగత సామర్థ్య పునర్నిర్మాణం, మెరుగుదలను సమానంగా చేయవలసి ఉంటుంది.

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం యొక్క వినియోగం మరియు ముందస్తు పరిశోధనల ఫలితాలు కూడా ఇలాంటి సంఘటిత చర్యల నేపథ్యంలో కీలకంగా మారాయి.

కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ఏదైనా అత్యవసర లేదా బాధాకర పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడం మరియు బాధితులకు ఉపశమనం అందించడం లాంటి ప్రాథమిక లక్ష్యంతో కూడన జాతీయ నిధిని కలిగి ఉండవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రధాన మంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధి (PM CARES Fund – పి.ఎం. కేర్స్ ఫండ్) ఏర్పాటు చేయబడింది.

ఈ ట్రస్ట్ కు భారతదేశ గౌరవ ప్రధానమంత్రి ఛైర్మన్ గా ఉంటారు. రక్షణ మంత్రి, హోం మంత్రి, ఆర్థిక మంత్రి ఇందులో సభ్యులుగా ఉంటారు.

ఏ సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత ప్రభావవంతమైన మార్గమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి విశ్వాసం. ఈ విషయాన్ని ఆయన అనేక సమయాల్లో చేతల్లో రుజువు చేశారు. దానికి ఇది కూడా ఓ ఉదాహరణ.

ఈ ఫండ్ సూక్ష్మ విరాళాలను కూడా అనుమతిస్తుంది. ఈ ఫండ్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలంతా ఎంత చిన్న విరాళాన్ని అయినా అందిచవచ్చు.

పౌరులు లేదా సంస్థలు pmindia.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ క్రింది వివరాలను ఉపయోగించి పి.ఎం. కేర్స్ ఫండ్‌కు విరాళాలు అందించవచ్చు:

ఖాతా పేరు : PM CARES

ఖాతా సంఖ్య: 2121PM20202

ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్: SBIN0000691

స్విఫ్ట్ కోడ్: SBININBB104

బ్యాంక్ మరియు శాఖ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ ప్రధాన శాఖ

యుపిఐ ఐడి : pmcares@sbi

ఈ క్రింది చెల్లింపు పద్ధతులు సైతం pmindia.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి –

డెబిట్ కార్డులు మరియు క్రెడిట్ కార్డులు

ఇంటర్నెట్ బ్యాంకింగ్

యుపిఐ (భీమ్, ఫోన్‌పే, అమెజాన్ పే, గూగుల్ పే, పేటిఎం, మొబిక్విక్, మొదలైనవి)

ఆర్.టి.జి.ఎస్ / ఎన్.ఈ.ఎఫ్.టి (నెఫ్ట్)

ఈ నిధికి అందించే విరాళాలకు సెక్షన్ 80(జి) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయింపబడతాయి.

DO YOU LIKE THIS ARTICLE?