ప్రపంచ కుబేరుల్లో భారత్‌కు 3వ స్థానం

ఆసియా కుబేరుడుగా తిరిగి ముఖేశ్‌ అంబానీ
ఫోర్బ్‌ జాబితాలో అగ్రభాగాన అమెజాన్‌ సిఇఓ
న్యూయార్క్‌ : అమెరికా, చైనా దేశాల తర్వాత ప్ర పంచంలో భారతదేశమే బిలియనియర్లు ఉన్న మూడవ అతిపెద్ద దేశంగా రికార్డులకు ఎక్కింది. ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్‌ మ్యాగజైన్‌ బుధవారంనాడు విడుదల చేసిన కొత్త జాబితా ప్రకారం భారత్‌కు ఈ గౌరవం దక్కింది. రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ తిరిగి ఆసియాలో అత్యం త ధనవంతుడుగా తన పపేరు నమోదు చేసుకున్నారు. చైనా వ్యాపారవేత్త జాక్‌ మా ను పక్కకు నెట్టి ముఖేశ్‌ ఆసియాలో అందరికంటే అధిక ధనవంతుడుగా తిరిగి తన స్థానాన్ని నిలబెట్టు కున్నారు. భారత్‌లో పదిమంది అగ్రశ్రేణి కుబేరుల్లో డీమార్ట్‌ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్‌ దమానీ, కొటక్‌ మహింద్ర బ్యాంక్‌ సిఇఓ ఉదయ్‌ కొటక్‌, ఆర్సెలోర్‌ మిట్టల్‌ ఎగ్జిక్యూటివవ్‌ ఛైర్మన్‌ లక్ష్మీమిట్టల్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా, సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ వ్యవస్థాపకుడు దిలిప సాంఘ్వి, భార్తి ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ సునిల్‌ మిట్టల్‌ ప్రభృతులు ఫోర్బ్‌ జాబితాలో నమోదయ్యారు. ఫోర్బ్‌ 35వ వార్షిక జాబితా సంఖ్య గణనీయంగా 2,755 మంది ప్రపంచ కోటీశ్వరులకు పెరిగిపోయింది. వీరందరి దగ్గర 13.1 టిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సంపద పోగుపడి ఉంది. రికార్డుస్థాయిలో 493 మంది ప్రపంచ కోటీశ్వరులు కొత్తగా వెలుగులోకి వచ్చారు. సుమారు ప్రతి 17 గంటలకు ఒక కోటీశ్వరుడు ఉద్భవిస్తున్నాడు. వీరిలో చైనా.హాంగ్‌కాంగ్‌లలో 210 మంది ఉండగా, 98 మంది అమెరికాలో ఉన్నారు. ఈ ఏడాది ప్రపంచ కుబేరులలో అత్యధికంగా ధనం కూడబెట్టిన మహిళల్లో ఫ్రాన్స్‌కు చెందిన కాస్మొటిక్స్‌ హెయిర్‌ ఫ్రాంకోయిస్‌ బెట్టెన్‌కోర్ట్‌ మెయెర్స్‌ దగ్గర 73.6 బిలియన్‌ డాలర్ల సంపద ఉంది. ఆమె ఫోర్బ్‌ జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్‌ 35వ వార్షిక జాబితాలో ప్రపంచ బిలియనీర్స్‌లో అమెజాన్‌ సిఇఓ-వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన వరుగా నాలుగో సంవత్సరంలో కూడా అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నికర ఆస్తులు 177 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు. ఏడాది క్రితం ఆయన ఆస్తులు 64 బిలియన అమెరికన్‌ డాలర్లు. అమెజాన్‌ షేర్లు భారీగా పెరుగుదల సాధించడంతో ఆయన ఆస్తుల విలువ కూడా గణనీయంగా పెరిగిపోయింది. స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడడు ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కోటీశ్వరులలో రెండవ స్థానం దక్కించుకున్నారు. డాలర్ల రూపంలో ఆయన ఆస్తులు గణనీయంగా పెరుగుదల సాధించాయి. ఆయన 151 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ఏడాది క్రితం ఆయన ఆస్తులు 126.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అప్పట్లో ఆయన 31వ ర్యాంక్‌లో నిలిచారు. టెస్లా షేర్లు 705 శాతం గణనీయంగా పెరుగుదల సాధిండంతో ఆయన ఉన్నతస్థానానికి ఎగబాకారు. కాగా భారత్‌కు చెందిన ముఖేశ్‌ అంబానీ కూడా ఆసియా ఖండంలో అత్యంత సంపన్నవంతుడుగా ఫోర్బ్‌ జాబితాలో ఈ ఏడాది అగ్రస్థానంలో దక్కించుకున్నారు. గతంలో ఆయనకు ఉన్న ఈ స్థానానిన చైనా వ్యాపారి జాక్‌ మా ఆక్రమించారు. ఇప్పుడు మళ్ళీ 84.5 బిలియన్‌ అమరికన్‌ డాలర్ల ఆస్తులు మూటగట్టుకుని ముఖేశ్‌ ఆసియాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది జాబితాలో అంబానీ ర్యాంకు 17 నుండి 26కు దిగజారింది. మళ్ళీ ఇప్పుడు పైకి ఎగబాకారు. అంటే సుమారు 10 బిలియన్‌ డాలర్ల మేరకు ఆయన వృద్ధి సాధించారు. భారత్‌లో ఉన్న అతి సంపన్నులలో ఆదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ ఆదానీ రెండవస్థానంలో ఉన్నారు. ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో గౌతమ్‌ ఆదానీ 50.5 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో 24వ స్థానం సంపాదించుకున్నారు. పూనవల్ల గ్రూపు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు, ప్రపంచంలో భారీగా టీకా ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తిదారు సైరస్‌ పూనవల్ల ఫోర్బ్‌ జాబితాలో ప్రపంచంలో 169వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర ఆస్తులు 12.7 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు. పూనవల్ల భారత్‌ కోటీశ్వరులలో ఏడవస్థానంలో ఉన్నారు. హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస వ్యవస్థాపకుడు శివ్‌ నాదర్‌ భారత్‌లో ఉన్న సంపన్నుల జాబితాలో మూడవస్థానంలో ఉన్నారు. ఆయన 23.5 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో ప్రపంచ ఫోర్బ్‌ జాబితాలో 71వ స్థానంలో ఉన్నారు. ఆదానీ, పూనవల్ల, శివ్‌ నాదర్‌ ఈ ముగ్గురి దగ్గరా కలిపితే 100 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఆస్తులున్నాయి. ఇదిలా ఉండగా, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతమంది కోటీశ్వరులు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో 724 మంది బిలియనీర్లు కంటే ఎక్కువమంది ఉన్నారు. గత ఏడాదిలో ఈ దేశంలో 614 మంది మాత్రమే ఉన్నారు. చైనా దేశంలో 698 మంది బిలియనీర్లు ఉన్నారు. గత ఏడాది చైనాలో 456 మంది ఉన్నారు. ఈ లెక్కన చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని రీతిలో చైనాలోనే భారీగా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ సంఖ్య న్యూయార్క్‌ నగరాదాన్ని దాటేసింది. భారత్‌లో అత్యధికంగా 140 మంది బిలియనీర్లు ఉన్నారు. జర్మనీలో 136 మంది, రష్యాలో 117 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆసియా – ఫసిఫిక్‌ దేశాల నుడి 1,149 మంది ప్రపంచ కోటీశ్వరులున్నారు. వీరందరి దగ్గరా 4.7 ట్రిలియన్‌ డాలర్ల సంపద మూలుగుతోంది. అదే సమయంలో అమెరికాలో ఉన్న ప్రపంచ కోటీశ్వరుల దగ్గర 4.4 ట్రిలియన్‌ డాలర్ల సంపద మూలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాబితాలో చూస్తే, 106 మంది ప్రపంచ కోటీశ్వరులు 40 ఏళ్ళు వయసు లోపేవారే ఉన్నారు. అందరికంటే అతి యువకుడైన ప్రపంచ కోటీశ్వరుడు జర్మనీలోని కెవిన్‌ డేవిడ్‌ లెహ్మాన్‌. ఆయన వయసు 18 సంవత్సరాలు. ఆయన తండ్రి గుంథెర్‌ లెహ్మాన్‌ తన ఆస్తిలో కొంతభాగాన్ని కొడుక్కి బదిలీ చేశాడు. ఆయనకు 3.3 బిలియన్‌ డాలర్ల ఆస్తులున్నాయి. ఆయన 925 ర్యాంక్‌లో నిలిచారు. ప్రపంచంలో అతి పురాతనమైన బిలియనీర్‌ 99 ఏళ్ళు వయసుగల ఆమెరికాకు చెందిన బీమా రంగ వ్యాపార దిగ్గజం జార్జ్‌ జోసెఫ్‌.
ఫ్రెంచ్‌ బిలియనీర్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ విదేశాల్లో సుమారు 70 బ్రాండులతో సామ్రాజ్యం నిర్మించాడు. వీటిలో లూయీస్‌ ఉయిట్టోన, సెఫోరా 150 బిలియన్‌ డాలర్లతో మూడవస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ బిల్‌గేట్స్‌ 124 బిలియన్‌ డాలర్లతో నాలుగోస్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బెర్గ్‌ 97 బిలియన్‌ డాలర్లతో ఐదోస్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అగ్రశ్రేణిలో ఉన్న పదిమంది బిలియనీర్ల దగ్గర 1.15 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లు ఉన్నాయి. మొత్తంమీద యూరప్‌ బిలియనీర్ల దగ్గర గత ఏడాది కంటే ఈ ఏడాదిలో ఒక ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లు అధికంగా పోగుపడ్డాయి.

DO YOU LIKE THIS ARTICLE?