ప్రజాఫ్రంట్‌ అభ్యర్థులకు ఓటెయ్యండి

తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ విజ్ఞప్తి
వీడియో సందేశం విడుదల చేసిన కాంగ్రెస్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఈనెల 7న జరిగే ఎన్నికలో ప్రజాఫ్రంట్‌ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియో సందేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. అందులో సోనియాగాంధీ వివరించిన అంశాలు ఆమె మాటల్లోనే..
‘ప్రియమైన తెలంగాణ సోదరీ సోదరులారా… నమస్కారం…
వచ్చే డిసెంబర్‌ 7వ తేదీన మీరందరూ మీ శాసనసభ్యులను ఎన్నుకునేందుకు ఓటు వేయబోతున్నారు. మీ ఓటు కేవలం తెలంగాణ భవిష్యత్తు కోసమే కాదు… మీ భవిష్యత్తు కోసం కూడా ఎంతో కీలకమైనది… కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్‌, సిపిఐలతో ఏర్పాటైన ప్రజాఫ్రంట్‌ మీ అందరి గొంతుక. ఇది మీ ఫ్రంట్‌. ఈ బంధం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను పరస్పరం కలుపుతుంది. నాలుగున్నరేళ్ళ క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇందులో నా పాత్ర కూడా ఉన్నది. కాని అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ (టిఆర్‌ఎస్‌) ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు సమయం వచ్చింది. తెలంగాణ ప్రజలారా… మీ ఆశలు, ఆకాంక్షలు, కోరికలను నెరవేర్చేందుకు మీ విలువైన ఓటు ప్రజాఫ్రంట్‌కు వేయాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఓటును ప్రజాఫ్రంట్‌ అభ్యర్థులకు వేయండి. జై తెలంగాణ… జైహింద్‌..” అని సోనియాగాంధీ సందేశం ఇచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

https://youtu.be/vvzSOfGaRyI

DO YOU LIKE THIS ARTICLE?