పోర్చుగల్‌లో బస్సు బోల్తా

29 జర్మనీ పర్యాటకులు మృతి
మడైరాలో మూడురోజులపాటు శోక దినాలు

కానికో: పోర్చుగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిం ది. పర్యాటకులతో వెళుతున్న బస్సు బోల్తా పడింది. దీంతో 29 మంది జర్మనీ ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ టన జరిగిన సమయంలో బ స్సులో మొత్తం 55 మంది ప్ర యాణికులు ఉన్నారు. మడైరాలోని కానికో అనే పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జర్మనీ కాలమానం ప్రకారం సాయంత్ర 5.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో చాలా వరకు వారి 40, 50 పదుల వయస్సులో ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. వారిలో 11 మంది పురుషులు కాగా, 18 మంది మహిళలు. వారంతా జర్మనీకి చెందిన పర్యాటకులు. రెస్క్యూ వర్కర్స్‌ గాయపడిన వారికి సేవలందించారు. కానికో పట్టణం సమీపంలో వాలుగా బస్సు దిగుతునప్పుడు అదుపుతప్పి పడిపోయిందని, చివరికి ఓ ఇంటిని ఢీకొనిందని సమాచారం. ఈ దుర్ఘటనపై జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ‘ఇది చాలా దుఃఖకరం. మడైరాలో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదంలో స్వదేశీయులు, ఇతరులు బాధితులయ్యారు’ అని తన ప్రకటనలో తెలిపారు. స్థానిక మేయర్‌ ఫిలిపీ సౌజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రమాదాన్ని వివరించేందుకు మాటలు రావడం లేదు. ప్రమాదానికి గురైన వాళ్లను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గురువారం డాక్టర్లు, సైకాలజిస్టుల బృందంతో మడైరా వెళ్లి బాధితులతో స్వయంగా మాట్లాడతాను’ అని జర్మనీ విదేశాంగ మంత్రి హికో మాస్‌ చెప్పారు. ప్రతి ఏడాది మొరాకో తీరప్రాంతంలోని అట్లాంటిక్‌ ద్వీపాలకు వాతావరణం రీత్యా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. బ్రిటన్‌ పర్యాటకుల తర్వాత అత్యధికంగా ఈ దీపాలకు వచ్చే పర్యాటకులు జర్మన్‌ వాసులే. మడైరాలో దాదాపు 2,70,000 మంది నివసిస్తుంటారు. మడైరా 2017లో ‘అట్లాంటిక్‌ ముత్యం’ గా, ‘తేలియాడే తోట’గా (ఫ్లోటింగ్‌ గార్డెన్‌) ప్రసిద్ధి చెందింది. మడైరాలో ఇదివరలో 2005లో సావో విసేంట్‌లో ఇలాంటి బస్సు ప్రమాదమే జరిగింది. అప్పుడు ఐదుగురు ఇటలీ పర్యాటకులు చనిపోయారు.

DO YOU LIKE THIS ARTICLE?