పేదల పక్షం

ఆధికారంలోకి రాగానే ‘కనీస ఆదాయ భరోసా పథకం’ : రాహుల్‌
20 శాతం నిరుపేదలకు ఏటా రూ. 72 వేలు ఖాతాల్లో జమ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అతిపెద్ద వాగ్దానాన్ని చేసింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. దీనిని దేశంలో నెలకొన్న పేదరికాన్ని తరిమికొట్టే సమూల చర్యగా ఆయన అభివర్ణించారు. కనీస ఆదాయ భరోసా పథకం ద్వారా అత్యంత పేదలైన 20 శాతం కుటుంబాలకు ఏడాదికి రూ.72 వేలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీ మ్యానిఫెస్టోపై చర్చించి దాని కి తుది రూపునిచ్చేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సోమవారం ఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. సమావేశ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రాహుల్‌ కనీస ఆదాయ భరోసా పథకం వివరాలను వెల్లడించారు. కనీస ఆదా య భరోసా పథకం ద్వారా 5 కోట్ల కుటుంబాల్లోని 25 కోట్ల మంది పేదలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు ఇదే చివరి దాడి అని రాహుల్‌ పేర్కొన్నారు. పేదరికంపై దాడి మొదలైందని, తాము దేశా న్ని పట్టి పీడిస్తున్న పేదరికాన్నితరిమికొడుతామని ఆయ న స్పష్టం చేశారు. ఇది చరిత్రాత్మకమైన రోజుగా రాహుల్‌ వ్యాఖ్యానించారు. పేదలకు న్యాయం చేస్తానని తాను వాగ్దానం చేస్తున్నానన్నారు. కనీస ఆదాయ పథకం కింద దేశంలోని 20 శాతం మంది నిరుపేద కుటుంబాలకు ఏటా రూ.72,000 చొప్పున నేరుగా వారి అకౌంట్‌లో జమ చేస్తాం’ అని రాహుల్‌ చెప్పారు. 5 కోట్ల కుటుంబాలు, 25 కోట్ల ప్రజలు నేరుగా లబ్ధి పొందుతారని తెలిపారు. పథకం అమలుకు సంబంధించి అధ్యయనం చేశామని, ప్రముఖ ఆర్థికవేత్తలను, నిపుణులను సంప్రదించామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు అని ఆయన పేర్కొన్నారు. 21వ శతాబ్దంలోనూ పేదరికం అధికంగా ఉందని, దానిపై తమ పార్టీ చివరి పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. కనీస ఆదాయ భరోసా పథకం పార్టీ ప్రణాళికలో ఒక భాగమని, ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారన్నారు. తాము అధికారంలోకి రాగానే దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటంబాలను గుర్తిస్తామని చెప్పా రు. నెలకు రూ 12,000లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పధకం వర్తింపచేస్తామని చెప్పారు. తమ పార్టీ మేనిఫెస్టోలో ఈ పథకం కీలకంగా ఉంటుందని తేల్చిచెప్పారు. కాగా, ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ధనవంతులకు డబ్బులు దోచిపెడుతున్నారని, పేదలను పట్టించుకోవ డం లేదని విమర్శించారు. గత ఐదేళ్ల నుంచి పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తాము న్యాయం చేకూరుస్తామని రాహుల్‌ భరోసానిచ్చారు. దేశంలోని ధనవంతులకు ప్రధాని మోడీ డబ్బులిస్తే, తాము దేశంలోని పేదలకు డబ్బులిస్తామని చెప్పారు. దేశా న్ని మోడీ రెండు భారత్‌లుగా సృష్టిస్తున్నారని, అలాంటి దాన్ని తాము అనుమతించబోమని, తాము దేశాన్ని ఒకే రకంగా చూస్తామన్నారు. అయితే కనీస ఆదాయ భరోసా పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, దీనివల్ల తీవ్ర ఆర్థిక భారం పడుతుంది కదా అని విలేకరులు ప్రశ్నించగా, దేశం లో చాలింత డబ్బులు ఉంద ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు స్పష్టం చేశారు. కాగా, తాను వాగ్దానం చేసినట్లుగా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లో రైతులకు రుణాలు మాఫీ చేసిన విషయాన్ని రాహుల్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే విధంగా అందరికీ న్యాయం చేస్తానని నేడు తా ను వాగ్దానం చేస్తున్నానన్నారు.కనీస ఆదాయ భరోసా పథకాన్ని విడుదల వారీగా అమలు చేస్తామని, మొదటగా పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రవేశపెడుతామని, ఆ తరువాత పూర్తిగా అమలు చేస్తామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?