పెళ్లి బంధంతో ఒక్కటైన ప్రముఖ షట్లర్లు

ఘనంగా సైనా, కశ్యప్‌ వివాహం

హైదరాబాద్‌: భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పారువల్లి కశ్యప్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు పదేళ్లుగా ప్రేమించికుంటున్న ఈ జంట చివరికి పెళ్లి బంధంతో ఒక్కటైంది. శుక్రవారం సైనా నివాసం ఒరియన్‌ విల్లాలో వీరిద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అత్యంత ఆప్తుల మధ్య సాదాసీదాగా ఈ వివాహ వేడుక జరిగింది. వివాహం అనంతరం తన జీవితంలో ఇదే పెద్ద మ్యాచ్‌ అని సైనా ట్వీట్‌ చేసింది. ఆదివారం హైటెక్‌ సిటిలోని నొవాటెల్‌ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ పార్టి జరుగనుంది. ఈ రిసెప్షన్‌లో క్రీడ ప్రముఖులతో పాటూ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?