పెన్షన్‌ రూ. 2,016

ఏప్రిల్‌ 2 నుండి పెన్షన్‌ రూ. 2,016
టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కెటిఆర్‌
నాగర్‌కర్నూల్‌ బ్యూరో : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆలోచనలే దేశానికి ఆచరణగా మారాయని టిఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటి రామారావు అన్నారు. ఏప్రిల్‌ 2 నుండి పింఛన్‌ రెట్టింపు చేసి రూ. 2,016 ఇస్తామని వెల్లడించారు. 57 ఏళ్ళకే ఆసరా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. వనపర్తిలో నిర్వహించిన టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కెటిఆర్‌ శనివారం మాట్లాడారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది ఒకనాటి ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి అని, ఇప్పుడు అలాంటి పరిస్థితి మారిందని చెప్పారు. కెసిఆర్‌ రైతు సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టిపెట్టారని, ఆయన ఆలోచనలే నేడు చాలా మంది ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారు. జిల్లాలో 4.98 మందికి రైతుబంధు అమలవుతుందని, పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మితో కెసిఆర్‌ మేనమామ అయ్యారుని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరని, టిఆర్‌ఎస్‌ కార్యకర్తల పోలింగ్‌ శాతాన్ని పెంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?