పెగాసస్‌ గూఢచర్యంపై ఉన్నతస్థాయి విచారణ ఐజెయు డిమాండ్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌ జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, ఇతర పాలకులపై విమర్శలు చేసే వారిపై చట్ట విరుద్ధమైన నిఘాను ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజెయు) తీవ్రంగా ఖం డించింది. పెగాసస్‌ గూఢచర్యంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షించే ఏ ఇతర ఏజెన్సీతోనైనా ఉన్నతస్థాయి విచారణను చేపట్టాలని ఐజె యు డిమాండ్‌ చేసింది. పారిస్‌కు చెందిన లాభాపేక్షలేని సంస్థ అయిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వెల్లడించిన విషయాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయని ఐజెయు అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ బల్విందర్‌ సింగ్‌ జమ్మూ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే విధంగా పౌరుల జీవితాల్లోకి చొరబడటానికి ఎటువంటి అడ్డంకులు లేవని విధంగా ఆ విషయాలు ఉన్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం తన స్వంత పౌరులపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టడం, గోప్యతపై దండయాత్ర చేయడం తీవ్రమైనదని, ఇది ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపడంతో పాటు సమాజపురోగతిని నిర్వీర్యం చేస్తుందన్నారు. భారతదేశంలో అక్రమ నిఘా సాధ్యం కాదని ప్రభుత్వంస్పష్టం చేసిందని, తిరస్కరించడం వల్ల నీరు లేదు, ఫ్రెంచ్‌ దేశంలో ఇలాంటి విషయాల వెల్లడిపై ఆ దేశ ప్రభుత్వం విచారణను వెంటనే ప్రారంభించాలని వారు సూచించారు. దేశంలోని ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలకు జవాబుదారీతనం లేకపోవడం, సరైన చట్టపరమైన కార్యాచరణ సమస్యలను ఇది తెలయజేస్తున్నదన్నారు. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన కె.ఎస్‌,పుట్టస్వామి తీర్పు పరిధిలో ప్రభుత్వం మొత్తం నిఘా యంత్రాంగాన్ని సమగ్రంగా పరిశీలించి, దాని వ్యవస్థ పరిధిలో సరికొత్త కార్యాచరణకు అందించే సమయం ఆసన్నమైందని వారు వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?