పిడుగుపాటుకు సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

ప్రజాపక్షం/నల్లగొండ: నల్లగొండజిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని 220 కెవి సబ్‌స్టేషన్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని నకిరేకల్‌ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ప్రమాద తీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సబ్‌ స్టేషన్‌లో పిడుగు పడడం వల్ల మంటలు చెలరేగాయని, దీంతో భారీగా ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా నిర్ధారణ అయిందన్నా రు. సుమారు 50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ ప్రభావం నార్కట్‌పల్లి, నక్కలపల్లి,ఈదులూరు, నెమ్మాని సబ్‌ స్టేషన్‌లపై ఉంటుందని చెప్పారు. ట్రాన్స్‌కో ఎస్‌ఇ, జెన్‌కో ఎస్‌ఇలతో మాట్లాడి నార్కట్‌పల్లి మం డలంలో సింగిల్‌పేస్‌ కరెంట్‌ ఇచ్చేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరతగతిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతస్థాయి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి వారం రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించినట్లు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?