పాలకుల ఆలోచనల్లో, కార్యాచరణలో మార్పు రావాలి

‘తెలంగాణ ఏర్పడి ఆరు సంవత్సరాలైన సందర్భంగా సంపూర్ణమైన సమీక్ష జరగాల్సి ఉన్నది. గత ఎన్నికల్లో రెండవసారి మళ్ళీ కెసిఆర్‌ నాయకత్వం కింద తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిన తరువాత వారు తాము చేసినటువంటి కార్యక్రమాలన్నింటికీ ప్రజల మద్దతు ఉన్నదని ప్రకటించుకుంటున్నారు. కానీ వాస్తవానికి కొన్ని సమస్యల మీద మాత్రమే కొంత పరిష్కారమయ్యాయి. అందులో ఒకటి విద్యుచ్ఛక్తికి సంబంధించి అనుమానం లేకుండా పరిస్థితి బాగా మెరుగైం ది. రైతుబంధు పథకం ద్వారా గణనీయమైన సంఖ్యలో రైతులకు కొంత సహాయం లభించింది. అయితే, ఇది రైతులందరికీ అందలేకపోదు. వాస్తవానికి ఆబ్సెంటీ ప్రెజెన్సీ ఉన్న చోట్ల కౌలుదారులకు ఈ సౌకర్యం లభ్యం కాకపోవడం చాలా తీవ్రమైన అసంతృప్తిని తీసుకువచ్చి పెట్టాయి. డబుల్‌ బెడ్‌రూమ్‌, దళితులకు మూడెకరాల భూమి వాగ్దానాలకే పరిమితమయ్యాయి. ఇరిగేషన్‌కు సంబంధించినంత వరకు ప్రచారార్భా టం చాలా ఎక్కువగా ఉంది. దక్షిణ తెలంగాణకు చాలా తీవ్రమైన నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పరిపూర్తి చేయకుండా తెలంగాణలో కరువు సమస్య పరిష్కారం కాదు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా కొన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పద్ధతి అవలంబిస్తున్నారు. ధర్నాలు, నిరసనలు తెలియజేయకుండా ధర్నా చౌక్‌ను మూసేయడం, రాజకీయ ఫిరాయింపులు చేయ డం ద్వారా ప్రతిపక్ష పాత్రను బలహీనం చేయడం, ప్రతిపక్షాలతో చర్చించకపోవడానికి సిద్ధం కాకపోవడం. ఏకపక్షంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా నియంతృత్వ తరహా పరిపాలన సాగించవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు. ప్రజాస్వామ్యమంటే ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికల్లో ఓటేసే హక్కు మాత్రమే కాదు. నిరంతరం విభిన్న సమస్యల మీద ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, వీరు నడుపుతున్న ఉద్యమాలు, వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజలతో మమేకమై పని చేయాలి. తెలంగాణలో ఇవాళ ఇది మృగ్యమైంది. ఇది బాధాకరమైన విషయం. తెలంగాణ అంటే అధికార పార్టీ, లేదా ముఖ్యమంత్రి, ఆయన కోటరీ అని అనుకోవడం ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. ప్రజలు పోరాడి

DO YOU LIKE THIS ARTICLE?